Regular Trains : తెలంగాణ, ఏపీ మీదుగా వెళ్లే ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇక రెగ్యులర్

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులరైజ్ చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిందగి.

Updated on: Aug 23, 2026, 12:49:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం రెండు ముఖ్యమైన వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరించి క్రమం తప్పకుండా నడపాలని నిర్ణయించింది. లాల్‌కువాన్ - బెంగళూరు సిటీ, అహ్మదాబాద్-తిరుచిరాపల్లి మార్గాల్లో నడిచే ఈ రైళ్లను రెగ్యులరైజ్ చేసినట్టుగా వెల్లడించింది. ఆగే స్టేషన్ల వివరాలను కింద తెలుసుకోవచ్చు.

భారతీయ రైల్వే (HT Telugu)
భారతీయ రైల్వే (HT Telugu)

లాల్‌కువాన్ జంక్షన్ – కేఎస్‌ఆర్ బెంగళూరు – లాల్‌కువాన్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Train No. 15302/15301)

ఈ రైలు ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 15302 (లాల్‌కువాన్ - బెంగళూరు) సెప్టెంబర్ 19, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 26, అక్టోబర్ 03 మరియు అక్టోబర్ 10). రైలు నంబర్ 15301 (బెంగళూరు - లాల్‌కువాన్) సెప్టెంబర్ 22, 2026 నుండి అందుబాటులోకి వస్తుంది (మినహాయింపు తేదీలు: సెప్టెంబర్ 29, అక్టోబర్ 06 మరియు అక్టోబర్ 13).

కిచ్చా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఈ ట్రైన్లు ఆగుతాయి.

అహ్మదాబాద్ – తిరుచిరాపల్లి – అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Train No. 19419/19420)

ఈ రైలు గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. రైలు నంబర్ 19419 (అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి) సెప్టెంబర్ 24, 2026 నుండి ప్రారంభమవుతుంది. రైలు నంబర్ 19420 (తిరుచిరాపల్లి - అహ్మదాబాద్) సెప్టెంబర్ 27, 2026 నుండి ప్రారంభమవుతుంది.

ఈ రైళ్లు అహ్మదాబాద్, వడోదర, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, కడప, రేణిగుంటలో ఆగుతుంది.

రాయగడ - గుంటూరు కొత్త టైమింగ్స్

రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రాయగడ స్టేషన్ : ఇప్పటివరకు ఈ రైలు రాయగడ నుంచి మధ్యాహ్నం 15:00 గంటలకు (3:00 PM) బయలుదేరేది. ఆగస్టు 24 నుంచి మధ్యాహ్నం 14:50 గంటలకే (2:50 PM) బయలుదేరుతుంది.

జిమిడిపేట స్టేషన్ : ఈ స్టేషన్‌కు రైలు చేరుకునే, బయలుదేరే సమయాల్లో కూడా మార్పులు చేశారు. పాత వేళల ప్రకారం మధ్యాహ్నం 15:16 కి వచ్చి 15:18 కి బయలుదేరేది. కొత్త షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 15:06 గంటలకు జిమిడిపేట చేరుకుని, 15:08 గంటలకు బయలుదేరుతుంది.

గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More