Telangana Inter Supplementary Exams 2026 : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని సవరించిన నేపథ్యంలో మే 28వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మే 28 (గురువారం) నాడు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (Environmental Education) పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీన బక్రీద్ రావటంతో…. మరుసటి రోజు అనగా మే 29, 2026 (శుక్రవారం) నాడు ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మే 29వ తేదీకి మార్పు…
మే 29వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. కేవలం మే 28న జరగాల్సిన పరీక్షలో మాత్రమే మార్పు ఉంటుందని…. మిగిలిన పరీక్షల షెడ్యూల్ యథాతథంగా (ఎలాంటి మార్పులు లేకుండా) కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ మార్పును తక్షణమే గమనించాలని బోర్డు ఆదేశించింది. సవరించిన పరీక్షా తేదీ సమాచారాన్ని విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు చేరేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. ఫలితంగా విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా చూసుకోవాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ మార్పును నోట్ చేసుకుని కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షకు హాజరుకావాలని తెలిపింది.