UGC NET Registration 2026 : యూజీసీ నెట్ జూన్ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు - కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే!
UGC NET June 2026 Registration : యూజీసీ నెట్ జూన్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 23 వరకు పొడిగించారు. అభ్యర్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA అధికారిక ప్రకటన విడుదల చేసింది.
UGC NET June 2026 Registration : దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం నిర్వహించే 'యూజీసీ నెట్ జూన్ 2026' పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే చివరి తేదీని పొడిగిస్తూ ఎన్‌టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత…. దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిజానికి గతంలో ప్రకటించిన ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం మే 20వ తేదీ రాత్రి 11:50 గంటలతోనే దరఖాస్తు గడువు ముగిసింది. అయితే, సాంకేతిక కారణాలు లేదా ఇతర ఇబ్బందుల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును మే 23వ తేదీ వరకు పొడిగించారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇప్పుడు మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ : అభ్యర్థులు మే 23వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు.
- పరీక్ష ఫీజు చెల్లింపు : దరఖాస్తు చేసుకున్న వారు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మే 23వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు పరీక్ష రుసుమును చెల్లించే వీలుంది.
- దరఖాస్తుల సవరణ (కరెక్షన్ విండో) : దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకునేందుకు ఎన్‌టీఏ ఎడిట్ ఆప్షన్ కల్పించింది. మే 25వ తేదీ నుండి మే 27వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తుల్లోని వివరాలను సవరించుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో అందుబాటులో ఉండే కరెక్షన్ విండో ద్వారా మాత్రమే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో గానీ, ఫీజు చెల్లింపులో గానీ ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు సహాయం కోసం ఎన్‌టీఏ హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000 లేదా 011-69227700 ద్వారా సంప్రదించవచ్చు. లేదా ugcnet@nta.ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపవచ్చు.
యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించిన మరిన్ని తాజా సమాచారం, అప్‌డేట్ల కోసం అభ్యర్థులు నిరంతరం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్లు అయిన www.nta.ac.in, ugcnet.nta.nic.in లను మాత్రమే సందర్శించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

