జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో దారుణం - రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య…!

Jubilee Hills Murder Case : హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్యతనూజ(55) హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఆమె విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 

Published on: May 8, 2026, 12:07:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Retired IPS Vinay Ranjan Ray Wife Murder : జుబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో దారుణం చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య భార్య తనూజ (55) తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు… వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలను సేకరించి… దర్యాప్తును వేగవంతం చేశారు.

రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య (istock image)
రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య (istock image)

వినయ్ రంజన్ రాయ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక విభాగాల్లో ఐపీఎస్ అధికారిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈ దంపతులు జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం…..పనిమనిషి కల్పన ఈ హత్యలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తించారు. కల్పన మరో ఇద్దరితో కలిసి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడినట్టు సమాచారం. ఆ తర్వాత ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని ముగ్గురు నిందితులు పరారైనట్టు పోలీసులు గుర్తించారు.

ఘటన జరిగిన వెంటనే జుబ్లీహిల్స్ పోలీసులు. ఉన్నతాధికారులు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ప్రాంతం కావడంతో ఇక్కడ నిరంతరం నిఘా, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అయినప్పటికీ ఇంతటి సాహసానికి నిందితులు ఎలా ఒడిగట్టారనేది మిస్టరీగా మారింది. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఘటనాస్థలికి సీపీ సజ్జనార్

హత్య సమాచారం అందుకున్న వెంటనే సీపీ సజ్జనార్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన….నేపాలీ పనిమనుషులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెల్లవారుజామున నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఐపీఎస్‌ అధికారి భార్య తనూజను హత్య చేశారని వివరించారు.నిందితులను పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని… త్వరలోనే కేసును చేధిస్తామని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More