Bio Asia 2026 : ఫ్యూచర్ సిటీలో స్పెషల్ జోన్.. ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైన జోన్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా  తెలిపారు.

Updated on: Feb 17, 2026, 21:05:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మక బయో ఆసియా 2026 ప్రపంచస్థాయి సదస్సు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

బయో ఆసియా 2026
బయో ఆసియా 2026

జీవవైజ్ఞానిక రంగంలో జీసీసీలు, ముఖ్యంగా ఇన్నొవేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైన జోన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సంకల్పించారు. దిగ్గజ కంపెనీల భేటీ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. అవేంటో చూద్దాం..

  • గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ అయిన ఒపెలా హెల్త్‌కేర్, 42 వేల చ.అ.విస్తీర్ణంలో జీసీసీని ఏర్పాటు చేసి త్వరలోనే కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ సంస్థ వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పిస్తుంది.
  • ఇండొనేషియాకు చెందిన జేఏపీఎఫ్ఏ అంతర్భాగమైన వాక్సిండో ఎనిమల్ హెల్త్‌కేర్ విభాగం జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్వైన్, ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తుంది.
  • ప్రముఖ ఏఐ, డేటా సైన్స్ కంపెనీ ట్రిడెన్స్ ఇన్‌కార్పొరేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఏఐ-ఆధారిత హెల్త్ కేర్‌, లైఫ్ సైన్సెస్‌పై కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కేంద్రం సుమారు 18 వేల చ. అడుగుల ప్రత్యేకమైన ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తుంది.
  • భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్‌ ప్రొపెల్లెంట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను నెలకొల్పుతుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్ చ.అ.విస్తీర్ణంతో అన్ని మౌలిక సదుపాయాలతో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఆరేళ్లలో ఈ సంస్థ పూర్తిస్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More