Vande Bharat Express : వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్ లో మారిన టైమింగ్స్..!
Yesvantpur - Kacheguda Vande Bharat Expres : వందే భారత్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. కాచిగూడ -యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే ట్రైన్ టైమింగ్స్ లో పలు మార్పులు చేసింది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ - యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది.

మారిన టైమింగ్స్….
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం…గతంలో ఉన్న టైమింగ్ ప్రకారం... యశ్వంతపూర్ - కాచిగూడ (ట్రైన్ నెంబర్ 20704) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03.48 నిమిషాలకు హిందూపూర్ చేరుకునేది. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 3.44 నిమిషాలకు యశ్వంతపూర్ నుంచి మధ్యాహ్నం 03.55 నిమిషాలకు చేరుకుని... మధ్యాహ్నం 03. 57 నిమిషాలకు బయల్దేరుతుంది.
ఇక కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.8 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని... 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఉండదు. ఈ ట్రైన్ మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











