...
...
Next Story

Hyderabad Passport Mela : పాస్‌పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారా...? ఒకేసారి 4 వేల స్లాట్లు, ఇవిగో వివరాలు

Hyderabad Passport Mela : హైదరాబాద్ ఆర్‌పీవో పరిధిలో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట. నవంబర్ 21న ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 4,000 అపాయింట్‌మెంట్లు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Nov 3, 2026, 07:09:21 IST
Advertisement

Hyderabad Passport Mela : పాస్‌పోర్ట్ సేవల కోసం అపాయింట్‌మెంట్ల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న దరఖాస్తుదారులకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గుడ్ న్యూస్ అందించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్‌మెంట్ దొరకక పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 'పాస్‌పోర్ట్ మేళా' నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది.

నవంబర్ 21న ప్రత్యేక డ్రైవ్…

పాస్‌పోర్ట్  (AP Photo/Luca Bruno) (AP Photo/Luca Bruno)
పాస్‌పోర్ట్ (AP Photo/Luca Bruno) (AP Photo/Luca Bruno)

2026 నవంబర్ 21 (శనివారం) నాడు ఈ ప్రత్యేక డ్రైవ్ లేదా పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి మాధవ్ ఆర్. సుల్ఫులే వెల్లడించారు. ఈ ప్రత్యేక మేళా ద్వారా సాధారణ (Normal), తత్కాల్ పాస్‌పోర్ట్‌లతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) వంటి మూడు విభాగాలకు సంబంధించి దాదాపు 4,000 అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తేనున్నారు.

నవంబర్ 3 నుంచి అపాయింట్‌మెంట్లు ప్రారంభం

ఈ ప్రత్యేక మేళాకు సంబంధించిన అపాయింట్‌మెంట్లను 2026 నవంబర్ 3 నుంచి దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్ ఆర్‌పీవో పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK), పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (POPSK) పరిధిలో దరఖాస్తుదారులు ఈ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల నిరీక్షణ సమయం తగ్గించడమే లక్ష్యం

"ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించడంతో పాటు దరఖాస్తుదారులకు నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ ప్రత్యేక మేళా ముఖ్య ఉద్దేశం," అని ఆర్‌పీవో అధికారి స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారం, సహాయం కోసం సంప్రదించాల్సిన వివరాలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks