...
...
Next Story

ఒక్క రూపాయి నోటు ఉంటే రూ.45 లక్షలు.. ఆశ చూపి లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే లక్షలు వస్తాయంటూ ఓ వ్యక్తిని కేటుగాళ్లు నమ్మించారు. విడతలవారీగా డబ్బులు దోచేశారు.

Published on: Sep 27, 2026, 14:27:57 IST
Advertisement

పాత రూపాయి నోటు ఉంటే రూ.45 లక్షలు ఇస్తామన్న ప్రకటనను నమ్మి ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని దారపోశాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు, డిఎస్పీ పేరుతో బెదిరింపులకు భయపడి నాలుగు రోజుల్లోనే రూ.7.9 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల బాధితుడు సెప్టెంబర్ 20న సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. 'మీ దగ్గర పాత ఒక రూపాయి నోటు ఉంటే రూ.45 లక్షలకు కొనుగోలు చేస్తాం.' అనేది ఆ ప్రకటన సారాంశం. ప్రకటనలోని ఫోన్ నంబర్‌ను బాధితుడు సంప్రదించగా, డబ్బులు అకౌంట్‌లో వేయడానికి ముందు నోటు ఫోటోలు, వ్యక్తిగత వివరాలు కావాలని సైబర్ కేటుగాళ్లు కోరారు. బాధితుడు వివరాలు పంపిన వెంటనే అసలు మోసం మొదలైంది. రూ.45 లక్షల భారీ మొత్తం డిపాజిట్ చేయడానికి ఆదాయపు పన్ను, ఆర్‌బీఐ క్లియరెన్స్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.

సెప్టెంబర్ 20 - 22 ఆర్బీఐ, ప్రాసెసింగ్, పన్నుల పేరుతో విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. సెప్టెంబర్ 23 ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ డీఎస్పీ పేరుతో బెదిరింపు చేశారు. వివిధ విడతలలో బాధితుడు మొత్తం రూ.7,90,000 చెల్లించాడు.

అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ డీఎస్పీగా నటిస్తూ ఒక కేటుగాడు ఫోన్ చేశాడు. 'నువ్వు బ్లాక్ మనీ విక్రయించే ముఠాతో చేతులు కలిపావు, కేసు నమోదు చేస్తాం.' అని బెదిరించి మరింత డబ్బు వసూలు చేశాడు. బాధితుడు భయాందోళనకు గురై మెుత్తం రూ.7.9 లక్షలకు పైగా పంపించాడు. చివరకు మళ్లీ డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks