ఆన్‌లైన్‌లో జాగ్రత్త.. ఒక క్లిక్ చేసే ముందు థింక్ చేయండి.. సైబర్ సేఫ్టీపై వినూత్న ప్రచారం!
2024లో తెలంగాణలో పిల్లలపై జరిగిన సైబర్ నేరాల్లో దాదాపు 17 శాతం కేసులు చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు సంబంధించినవే. తెలంగాణలో పిల్లలపై సైబర్ నేరాలు 8 ఏళ్లలో 0 నుంచి 72కు పెరిగినట్టుగా ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ చిన్నారుల చదువుకు, వినోదానికి, భావవ్యక్తీకరణకు ఎన్నో తలుపులు తెరిచింది. అయితే అదే స్థాయిలో ఆన్‌లైన్ ప్రపంచం వారి భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోంది. సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచార చోరీ, ఫొటోల దుర్వినియోగం, డిజిటల్ లైంగిక వేధింపుల బారిన పడి అనేకమంది పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

ఈ భయానక పరిస్థితులపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు CRY (చైల్డ్ రైట్స్ అండ్ యు) ప్రతిష్టాత్మకమైన 'టింగ్ టాంగ్' ప్రచారాన్ని చేపట్టింది. ఆన్‌లైన్ లో ఏదైనా క్లిక్ చేసే ముందు, సమాచారాన్ని షేర్ చేసే ముందు లేదా నమ్మే ముందు కాస్త ఆగి రెండుసార్లు ఆలోచించాలి అనేదే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలను విశ్లేషించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుండి 2024 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పిల్లలపై జరిగే సైబర్ నేరాలు ఏకంగా 20 రెట్లు పెరిగాయి. 2017లో కేవలం 88 కేసులు మాత్రమే నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 1,753కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) కింద నమోదయ్యే నేరాలు దేశంలో 157 రెట్లు పెరిగాయి. 2017లో తెలంగాణలో సున్నాగా ఉన్న బాలల సైబర్ నేరాల సంఖ్య 2024 నాటికి 72 కేసులకు పెరిగింది. దేశవ్యాప్త కేసుల్లో తెలంగాణ 4 శాతం వాటాతో 8వ స్థానంలో ఉంది.
తెలంగాణలో నమోదైన 12 CSAM కేసుల్లో 83 శాతం కేసులు సైబరాబాద్, వరంగల్, రామగుండం, రాజన్న సిరిసిల్ల కమిషనరేట్ల పరిధిలోనే నమోదయ్యాయి. 'స్క్రీన్లపై జరిగే దాడులు చిన్నారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. భయంతో చాలామంది పిల్లలు ఈ వేధింపులను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తున్నారు.' అని జాన్ రాబర్ట్స్, సౌత్ రీజినల్ డైరెక్టర్ (CRY) అన్నారు.
ఈ సైబర్ బెదిరింపుల నుంచి పిల్లలకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ పోలీస్ నిఘా విభాగం ('ఉమన్ సేఫ్టీ వింగ్'), సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లు శ్రమిస్తున్నాయి.
సైబ్‌హెర్ (CybHER) ప్రోగ్రామ్ విద్యార్థినులలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం అమలవుతోంది. పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయులను, విద్యార్థులను 'సైబర్ అంబాసిడర్లు'గా తీర్చిదిద్ది సైబర్ నేరాలపై చైతన్యం నింపుతున్నారు. డిజిటల్ నోటిఫికేషన్ లేదా అలర్ట్ శబ్దమైన ‘టింగ్ టాంగ్’ను మైండ్ అలారమ్‌గా వాడుకోవాలని CRY పిలుపునిచ్చింది.
CRY చెప్పిన ముఖ్య సూత్రాలు ఏంటంటే.. నమ్మే ముందు: ఆలోచించండి, క్లిక్ చేసే ముందు: జాగ్రత్త వహించండి, షేర్ చేసే ముందు: స్వయంగా సరిచూసుకోండి అనేది టింగ్ టాంగ్ క్యాంపెయిన్ ఉద్దేశం.
ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలను భాగస్వాములను చేస్తూ ఆన్‌లైన్ భద్రతను ఒక సామాజిక బాధ్యతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించేందుకు సాంకేతిక సంస్థలు కూడా తమ వయస్సు ధృవీకరణ విధానాలను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాంపెయిన్ ముఖ్యాంశాలు
పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల్లో అవగాహనను, డిజిటల్ సాధికారతను పెంపొందించడం.
సమాజికంగానూ, పాఠశాలలు కేంద్రంగానూ చేపట్టే చిన్నారుల రక్షణ కార్యక్రమాల్లో ఆన్‌లైన్ భద్రతను చేర్చడం.
ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం పిల్లలకు అందించడం
బహుళ వేదికలతో భాగస్వామ్యాల ద్వారా నిరంతర ప్రజా భాగస్వామ్యంతో ఈ చర్చను ముందుకు తీసుకెళ్లడం.
పాలనా, విధాన పరమైన చర్చల్లో చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను తక్షణ ప్రాధాన్యత గల అంశంగా నిలబెట్టడం.
“భారతదేశ డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ, ఈ సమష్టి ఉద్యమంలో భాగం కావాలని ప్రతి పౌరుడిని CRY ఆహ్వానిస్తోంది. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా, విధాన నిర్ణేతలుగా, సాంకేతిక నిపుణులుగా లేదా సమాజంలోని సభ్యులుగా – చిన్నారులకు భద్రదమైన సైబర్ వాతావరణాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది” అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


