కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు తీరు ఏ మాత్రం సరిగా లేదని… నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసుపై సిట్ విచారణ జరిపించాలని… నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 8న సాయంత్రం బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, పేట్ బషీరాబాద్ పోలీసులు సుమారు 5 గంటల పాటు వారిని తిప్పించుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. "ఫిర్యాదులో అంశాలు మార్చాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు హెచ్చరిస్తే తప్ప కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయం" అని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ పలు ప్రశ్నలు సంధించారు. "మీ సభలో వేలాది మంది మహిళలు కూర్చున్నారు. మీ పక్కనే ఉన్న మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు….? పోక్సో చట్టం ప్రకారం మైనర్ సమ్మతితో సంబంధం లేకుండా అది నేరమే అవుతుంది. గతంలో మీరు ఆ అబ్బాయితో ఫోటో దిగారు, ఇప్పుడు సమాధానం చెప్పాలి" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
సిట్ వేయాలి - ప్రవీణ్ కుమార్ డిమాండ్
ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మహిళా డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో 'సిట్' వేయాలని…. నిందితుడిని వెంటనే జైలుకు పంపాలని కోరారు.
{{/usCountry}}ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మహిళా డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో 'సిట్' వేయాలని…. నిందితుడిని వెంటనే జైలుకు పంపాలని కోరారు.
{{/usCountry}}“ఎప్పుడైనా కరీంనగర్ పోలీసులు బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదే జరిగితే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు 164 Cr PC స్టేట్మెంట్ రికార్డు చేయలేదు…? బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
బండి సంజయ్ పీఆర్వోలు మీడియాకు ఫోన్ చేసి ఇదొక 'హనీ ట్రాప్' అని రాయాలని ఒత్తిడి చేస్తున్నారని…. పోక్సో విషయం బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజీని సేకరిస్తే అసలు విషయాలు బయటపడతాయని డీజీపీకి సూచించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కాపాడాలని చూస్తున్నారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన సంగప్ప ఏప్రిల్ నెలలో బాధిత కుటుంబాన్ని కలిశారు.ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ తో కలిపించారు. సంగప్పను పార్టీ నుంచి బహిష్కరించి… ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళా మంత్రులైన సీతక్క, కొండా సురేఖలు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసుల నుంచి రక్షణ కోసమే బండి సంజయ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో నిందితుడికి సహకరిస్తున్న కొందరు బాధ్యులైన అధికారులందరిని సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి… మెజిస్ట్రేట్ ముందు వెంటనే స్టేట్‌మెంట్ రికార్డు చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు.