...
...
Next Story

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం - లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు ప్రయాణికులు మృతి

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు… లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… ఐదుగురికి గాయాలయ్యాయి. నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Nov 16, 2025, 09:49:01 IST
Advertisement

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని తెలంగాణ ఆర్టీసీ రాజధాని బస్సు (టీజీ 03Z 0046) వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు

ఈ ఘటనలో హైదరాబాద్‌ కు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెంటనే చేరుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవలే రాష్ట్రంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ… ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదే కాకుండా… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో కూడా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకున్నప్పటికీ… పలువురు గాయపడ్డారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe