...
...
Next Story

Bus accident : ఎన్​హెచ్​-44పై ఆర్టీసీ బస్సు బోల్తా- 20మందికి గాయాలు..

తెలంగాణ జోగులాంబ గద్వాల్​ జిల్లాలోని ఇటిక్యాలపాడు స్టేజీ వద్ద ఉన్న ఎన్​హెచ్​ 44పై ఒక బస్సు బోల్తా కొట్టింది. గురువారం అర్థరాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు.

Published on: Feb 19, 2026, 07:32:38 IST
Advertisement

జోగులాంబ గద్వాల్​ జిల్లాలో గురువారం అర్థరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాలపాడు స్టేజీ వద్ద ఉన్న ఎన్​హెచ్​ 44పై ఒక ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థిత విషమంగా ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్​ నుంచి అనంతపూర్​కి వెళుతుండగా..

జోగులాంబ గద్వాల్​ జిల్లాలో బస్సు ప్రమాదం..
జోగులాంబ గద్వాల్​ జిల్లాలో బస్సు ప్రమాదం..

సంబంధిత ఆర్టీసీ బస్సు హైదరాబాద్​ నుంచి అనంతపూర్​కి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. అతివేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. అది గమనించిన వెంటనే స్థానికులు, పక్కనే ఉన్న వాహనదారులు ఘటనాస్థలానికి పరిగెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. ఎమర్జెన్సీ సేవలు అందించి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు బోల్తా- అతివేగమే కారణమా?

ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 20మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయని అధికారులు చెప్పారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు, ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు.

జోగులాంబ గద్వాజ్​ జిల్లా ఇటిక్యాలపాడు దగ్గర ఉన్న ఎన్​హెచ్​ 44 వద్ద జరిగిన ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఘటనకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు కానీ, డ్రైవర్​ అతివేగం వల్లే ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ ఘటన తర్వాత ఎన్​హెచ్​ 44పై ట్రాఫిక్​కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో పరిస్థితులు మాములు స్థితికి చేరుకున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks