BioAsia 2026 : ఈనెల 17 నుంచి హైదరాబాద్ వేదికగా ‘బయో ఆసియా’ సదస్సు

హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో 4,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 

Published on: Feb 16, 2026 9:19 AM IST
ANI | By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ వేదికగా ‘బయో ఆసియా 2026’ సదస్సు సన్నద్ధమవుతోంది. జీవశాస్త్రంలో వస్తున్న మార్పులు, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నిరంతర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా సదస్సులో కీలక చర్చలు నిర్వహించనున్నారు. హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

బయో ఆసియా సదస్సు 2026
బయో ఆసియా సదస్సు 2026

4 వేల మంది ప్రతినిధులు…

ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ సమ్మేళనంగా బయో ఆసియా సదస్సుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి నిర్వహించబోయే సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటాయి. 2025లో నిర్వహించిన సదస్సుకు 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

2026 ఎడిషన్ సదస్సుకు సంబంధించి ‘టెక్‌బయో అన్‌లీష్డ్‌: ఏఐ, ఆటోమేషన్‌- బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో దీన్ని నిర్వహించనున్నారు.ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడ్ టెక్, డిజిటల్ హెల్త్ మరియు అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో 175 మంది ఎగ్జిబిటర్లతో భారీ ప్రదర్శన ఉంటుంది.

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావంపై ఈ సదస్సులో చర్చిస్తారు. హెల్త్‌కేర్‌ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్‌ సైన్సెస్‌ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్‌ బయో ఎకానమీని బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రసంగిస్తారు. హెల్త్‌కే ర్‌ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడనుంది. పలు అంకుర సంస్థల ప్రాజెక్ట్ వివరాలను కూడా ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎల్‌.లెవిన్, అమ్జెన్‌ సంస్థ సీఎస్‌వో డాక్టర్‌ హోవర్డ్‌ వై.చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ స్టెఫాన్‌ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్‌ రోచ్‌ వంటి ప్రముఖులు పలు చర్చల్లో పాల్గొంటారు. ఏఐ-ఆధారిత ఔషధ ఆవిష్కరణ, బయో మాన్యుఫ్యాక్చరింగ్ మరియు అధునాతన పద్ధతులపై చర్చిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More