...
...
Next Story

TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల

Telangana Rythu Bharosa Scheme : ఇవాళ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి విడత కింద రూ. 6 వేలు జమవుతాయి.

Published on: Mar 22, 2026, 06:48:29 IST
Advertisement

రైతులకు పెట్టుబడి సహాయం అందించే 'రైతు భరోసా' నిధులు ఇవాళ విడుదలకానున్నాయి. ఒక ఎకరం భూమి కలిగిన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.3,590 కోట్ల మొదటి విడత మొత్తాన్ని జమ చేస్తారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిధుల విడుదల ఉంటుంది.

ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల
ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల

మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.

రెండు పంటల సీజన్లకు గాను ఎకరానికి రూ.6,000 చొప్పున నిధులు జమ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన 'రైతు భరోసా' పథకంలో భాగంగా... ప్రభుత్వం మొత్తం రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతు భరోసా పథకం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రైతు భరోసా పథకం అన్నదాతలు ఇన్‌పుట్ ఖర్చులను కవర్ చేయడానికి, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది.

రైతు భరోసా నిధులు - మరింత సమాచారం:

  • మొదట విడతలో(ఆదివారం) ఎకరం లేదా ఎకరంపైన భూమి గల రైతులకు 6000 రూపాయలు జమ కావడం జరుగుతుంది.
  • ఉదాహరణకు (1ఎకరం ఉన్న రైతుకు 6000), (2 ఎకరాలు ఉన్న రైతుకు 6000/) , (3 ఎకరాలు ఉన్న రైతుకు 6000)… ఇలా ఎకరం పైన ఎంత భూమి ఉన్న మొదటి విడతలో రూ. 6000 రైతుల ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది.
  • మిగతా మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ రెండు మరియు మూడు విడతలలో రైతుల ఖాతాల్లో జమవుతాయి.
  • రెవెన్యూ గ్రామ ప్రాధిపదికనపై విధంగా 6000/- జమ అవుతాయి. (ఉదాహరణకు ఒక రైతుకు మూడు రెవెన్యూ గ్రామాల్లో ఒక్కో రెవెన్యూ గ్రామంలో 2 ఎకరాల భూమి ఉంటే…. మూడు రెవెన్యూ గ్రామాల పరిధి లెక్కన రూ. 18 వేలు జమ అవుతాయి.
  • ఎకరంలోపు ఉన్న రైతులకు యధావిధిగా గతంలోలాగా భూమి విస్తీర్ణం అనుగుణంగా జమ అవుతాయి. (ఉదాహరణకు ఇరవై గుంటలు ఉన్న రైతుకు రూ.3000 )
  • ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రైతుభరోసా జమకాని రైతులకు మరియు క్రొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతులకు రెండవ విడతలో రైతు భరోసా నిధులు జమ అవుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe