...
...
Next Story

శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకరించిన అయ్యప్ప భక్తులు

శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతి దర్శనం చేసుకుని పులకరించిపోయారు.

Published on: Jan 14, 2026, 19:57:59 IST
Advertisement

శబరిమలలో పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శనం చేసుకుని పులకరించిపోయారు. ఈ సందర్భంగా శబరిమల మెుత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. అంతకుముందు పందాళం నుండి తెచ్చిన తిరువాభరణంతో స్వామివారికి అలంకరించారు.

మకరజ్యోతి దర్శనం (X)
మకరజ్యోతి దర్శనం (X)

అనంతరం స్వామివారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం అయింది. లక్షలాది మంది భక్తులు ఈ శుభ క్షణాన్ని వీక్షించి పరవశించిపోయారు. సాయంత్రం నిర్ణీత సమయానికి వెలిగిన దివ్య జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానం, కొండలపైకి తరలివచ్చారు . స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భక్తులు పులకరించిపోయారు.

సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో మకర జ్యోతి వెలిగింది. మకర జ్యోతి దర్శనం చేసుకోవడానికి సన్నిధానం వద్ద వేలాది మంది బారులు తీరారు. కొన్ని రోజులుగా దర్శనం కోసం వచ్చిన వారు సన్నిధానంలో వెలిగిన మకర జ్యోతిని చూడటానికి వేచి ఉన్నారు. సన్నిధానం, పంపతో సహా పొన్నంబలమేడు పర్వత శ్రేణుల్లో జ్యోతి కనిపించే అన్ని ప్రదేశాలలో గంటల తరబడి భక్తులు వేచి ఉన్నారు. మకరజ్యోతి వెలిగిన క్షణంలో పులకరించిపోయారు.

మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం భద్రతా దృష్టిలో ఉంచుకుని పోలీసులు, దేవస్థానం బోర్డు, ఇతర విభాగాలు కఠినమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణను విధించినట్లు అధికారులు తెలిపారు. మకర జ్యోతి దర్శనంతో శబరిమలలో మకరవిళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరుకుంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe