శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. అయ్యప్పను తొలివారంలోనే 5.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడితో ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమావేశమై తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. శబరిమల వద్ద రద్దీ, రియల్ టైమ్ జనసమూహం ఆధారంగా స్పాట్-బుకింగ్ పరిమితిని పెంచాలని, దర్శనాలను నిమిషానికి 85 మంది యాత్రికులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా సమావేశంలో శబరిమల భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచానికి అనేక చర్యలను కూడా ఆమోదించారు. ప్రస్తుతం ప్రతి నిమిషానికి దాదాపు 70 మంది భక్తులు 18 మెట్లను ఎక్కుతున్నారు. ఇప్పుడు దీనిని 85కి పెంచనున్నారు. భక్తుల దర్శనాలను వేగవంతం చేయడానికి మెట్లపై అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందిని అదనంగా నియమిస్తున్నారు.
శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, పోలీసులు, ఆరోగ్యం, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్, అటవీ, జల సంస్థ PWD ప్రతినిధులు పాల్గొనే ఉమ్మడి రోజువారీ సమీక్షా సమావేశం సన్నిధానంలో జరుగుతుంది. పంపా, నీలక్కల్ వద్ద కూడా ఇలాంటి సాధారణ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో లేవనెత్తిన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరిస్తున్నారు.
తాజాగా కొన్ని సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేశారు. సన్నిధానం ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శాఖ ఎకో సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. సన్నిధానం, పంపా, నీలక్కల్‌లలో పోలీసు యూనిట్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పంపా వద్ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తారు.
నీలక్కల్ పార్కింగ్ స్థలాన్ని వెంటనే పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందించడానికి పంపా, నీలక్కల్ వద్ద పెద్ద ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. 24/7 టాయిలెట్ శుభ్రపరచడానికి ఎక్కువ మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం సూపర్‌వైజర్లు ఉంటారు. బయో-టాయిలెట్లు, తాగునీటి సరఫరా కేంద్రాల సంఖ్యను పెంచారు.
అటవీ మార్గంలో లైటింగ్, తాగునీటి సదుపాయం మెరుగుపరుస్తున్నారు. సన్నిధానంలోని హోటల్ కార్మికులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు, తక్షణ హెల్త్ కార్డులను జారీ చేయాలని, భద్రతా కోసం అగ్నిమాపక, రెస్క్యూ తనిఖీలు ఎప్పటికప్పుడు ఉంటాయి. కేఎస్ఆర్టీసీ, పోలీసుల మధ్య సమన్వయం బలోపేతం చేసుకుంటున్నారు.
{{/usCountry}}అటవీ మార్గంలో లైటింగ్, తాగునీటి సదుపాయం మెరుగుపరుస్తున్నారు. సన్నిధానంలోని హోటల్ కార్మికులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు, తక్షణ హెల్త్ కార్డులను జారీ చేయాలని, భద్రతా కోసం అగ్నిమాపక, రెస్క్యూ తనిఖీలు ఎప్పటికప్పుడు ఉంటాయి. కేఎస్ఆర్టీసీ, పోలీసుల మధ్య సమన్వయం బలోపేతం చేసుకుంటున్నారు.
{{/usCountry}}మరోవైపు 140 మంది సభ్యులతో కూడిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం శనివారం బాధ్యతలు స్వీకరించింది. డిప్యూటీ కమాండర్ నేతృత్వంలో ఈ యూనిట్ సన్నిధానం, మరకూట్టంలో ఉంటుంది. 32 మంది సిబ్బందితో కూడిన మూడు షిఫ్టులలో పనిచేస్తుంది. 24 గంటల స్టాండ్‌బైలో 10 మంది సభ్యుల క్విక్ రెస్పాన్స్ బృందం సపోర్ట్ ఇస్తుంది. నవంబర్ 27న జరిగే ప్రత్యేక సమావేశంలో ఎరుమెలిలోని ఏర్పాట్లను సమీక్షిస్తారు.