Hyderabad : సంజీవయ్య పార్క్‌లో మల్టీమీడియా లేజర్ షో ప్రారంభం - టైమింగ్స్, టికెట్ ధరల వివరాలు ఇవే…!

Hyderabad Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్ సంజీవయ్య పార్క్‌లో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షోలను పర్యాటకుల కోసం ప్రారంభించారు. ప్రదర్శన వేళలు, టికెట్ ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

Published on: Aug 19, 2026, 18:45:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సంజీవయ్య పార్క్‌లో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) సిద్ధమైంది. పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్‌లను అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సంజీవయ్య పార్క్‌లో మల్టీమీడియా లేజర్ షో
సంజీవయ్య పార్క్‌లో మల్టీమీడియా లేజర్ షో

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో సుమారు రూ. 49.65 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందిస్తూ, నగర పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

కన్నుల పండువగా సాగే ఈ మల్టీమీడియా షోలో అద్భుతమైన లేజర్ ప్రొజెక్షన్లు, నీటి తెరలపై (వాటర్ స్క్రీన్) కనిపించే మనోహరమైన దృశ్యాలు, సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే మ్యూజికల్ ఫౌంటెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చే సందర్శకులు, పిల్లలు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.

షో సమయాలు:

  • మొదటి షో: సాయంత్రం 7:00 గంటల నుంచి 7:30 గంటల వరకు
  • రెండో షో: రాత్రి 8:00 గంటల నుంచి 8:30 గంటల వరకు

ప్రవేశ టికెట్ ధరలు:

  • పెద్దలకు: రూ. 150 (ఒక్కొక్కరికి)
  • పిల్లలకు (5 నుంచి 12 సంవత్సరాలు): రూ. 120 (ఒక్కొక్కరికి)

హైదరాబాద్ పర్యాటక రంగానికి సరికొత్త శోభను తీసుకువచ్చిన ఈ ప్రత్యేకమైన మల్టీమీడియా లేజర్ షోను వీక్షించి, ఆహ్లాదకరమైన అనుభూతిని పొందాలని పర్యాటకులను, హైదరాబాద్ ప్రజలను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాల కోసం 9848126947, 9848125720, 9848306435, 8340811234 నెంబర్లను సంప్రదించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More