సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావటంతో… చాలా మంది నగరం నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది.

గత రెండు రోజులుగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ… ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
మరోవైపు ఈ హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలతో… అధికారులు,పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రూట్స్ పై ఓ లుక్కేయండి…
సాధారణంగా పండగ సమయాల్లో హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా రద్దీ ఉంటుంది. హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపుర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజ్, చిట్యాల వరకు కూడా వాహనాలు బారులు తీరుతుంటాయి. పైగా ఈ హైవేపై గత కొంతకాలకంగా అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు.
- సాధారణంగా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు చౌటుప్పల్ మీదుగానే వెళ్తుంటారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు, వాహనాల రద్దీ దృష్ట్యా…. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్‌పల్లి దాటితే సాఫీగా జర్నీ సాగిపోతుంది.
- హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు వైపు ప్రయాణికులు… సాగర్ వైవేను ఎంచుకోవచ్చు. నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే పెద్దగా వాహనాల రద్దీ ఉండదు. ప్రయాణం కూడా సాఫీగా సాగిపోతుంది.
- సాగర్ హైవేపునకు వెళ్లాలనుకునేవారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లొచ్చు. వీరు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని ఇబ్రహీంపట్నం రూట్ కు వెళ్లాలి. అక్కడ్నుంచి నాగార్జునసాగర్ హైవేపైకి వెళ్తే సరిపోతుంది.
- ప్రతి ఆదివారం చౌటుప్పల్‌లో సంత(మార్కెట్) జరుగుతుంది. ఈ సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. వాహనాలు కూడా బారులు తీరుతుంటాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆదివారం వెళ్లే వారు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవచ్చు,
మరోవైపు ఉదయం సమయాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే పొగమంచు పరిస్థితులు తగ్గిన తర్వాతే ప్రయాణాలు చేసుకోవాలని చెబుతున్నారు. హైవేపై అతివేగంగా వెళ్లకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు ఉదయం సమయాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే పొగమంచు పరిస్థితులు తగ్గిన తర్వాతే ప్రయాణాలు చేసుకోవాలని చెబుతున్నారు. హైవేపై అతివేగంగా వెళ్లకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}