సంగారెడ్డి జిల్లాలోని ఫార్మా ల్యాబ్స్‌లో గ్యాస్ లీక్.. ఇద్దరు ఏపీ వాసులు మృతి
సంగారెడ్డి జిల్లాలోని ఓ పరిశ్రమలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాకా లాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సుదర్శన్ రావు (27), బాలాజీగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం లభించింది.
సరాకా లాబొరేటరీస్ ఫార్మా యూనిట్లో శుక్రవారం తెల్లవారుజామున విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ప్రమాదకరమైన వాయువు లీకైంది. విషవాయువు పీల్చడంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీకి గల కచ్చితమైన కారణాలు, ప్రమాద సమయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న కోణంలో సైతం సమగ్ర విచారణ జరుపుతున్నామని క్షేత్రస్థాయి అధికారులు వెల్లడించారు.
పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
'సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం. గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటోంది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.' అని హరీశ్ రావు అన్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు మీరు చేస్తున్నదేమిటి? అని హరీశ్ రావు ప్రశ్నించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు? అని అడిగారు. సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలన్నారు. ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


