తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇవాళ రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకల్లా ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఇక చివరిదైన మూడో విడత డిసెంబర్ 17న ఉంటుంది. ఆ వెంటనే కొత్తగా గెలిచిన వారు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఈనెల 20న ప్రమాణం…

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
ఈ తేదీనే కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే వీటిలో ఫలితాలు తేలిపోయాయి. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్రంలోని 32 గ్రామపంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.
రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఎన్నికల నిర్వహణ కుదరలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… బీసీలకు రిజర్వేషన్లను 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కుల గణన కూడా నిర్వహించింది.
ఈ ఏడాది సెప్టెంబరు 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వేర్వరు పిటిషన్లు దాఖలు కావటంతో… అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంతో పాటు హైకోర్టు స్పష్టం చేసిది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి.
{{/usCountry}}ఈ ఏడాది సెప్టెంబరు 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వేర్వరు పిటిషన్లు దాఖలు కావటంతో… అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంతో పాటు హైకోర్టు స్పష్టం చేసిది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి.
{{/usCountry}}