తెలంగాణ : ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు - సాయంత్రం ఫలితాలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 3,906 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.

Published on: Dec 14, 2025, 04:30:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,906 పంచాయతీలకు సర్పంచ్, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

పంచాయతీ ఎన్నికలు - పోలింగ్
పంచాయతీ ఎన్నికలు - పోలింగ్

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.

సాయంత్రం వరకు ఫలితాలు

మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మరోవైపు సర్పంచ్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.... ఇదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.... ఈ 2 విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడుతున్నారు.

ఇక రెండో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలో ఉన్న చాలా మంది ఓటర్లు తరలివెళ్లారు. శనివారం నగరంలో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రోడ్డుపై రద్దీ నెలకొంది. మరికొన్ని ప్రధాన రహదారుల్లో కూడా ఇదే మాదిరి పరిస్థితి కనిపించింది. ఇక మూడో విడత పోలింగ్ ఈనెల 17వ తేదీన ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More