పవిత్ర హజ్ యాత్ర-2027(Haj 2027)కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. యాత్రకు సంబంధించిన షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాలను తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ అఫ్జర్ బియాబానీ అధికారికంగా విడుదల చేశారు. ముస్లిం సోదరులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హజ్-2027 యాత్రకు వెళ్లాలనుకునే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 22, 2026 నుంచే ప్రారంభమైందని ఛైర్మన్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి జూలై 20, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుదారుల వద్ద తప్పనిసరిగా అంతర్జాతీయ పాస్‌పోర్ట్ ఉండాలి. ఈ పాస్‌పోర్ట్ గడువు కనీసం డిసెంబర్ 31, 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు.
ఒక హజ్ కవర్ నెంబర్ కింద గరిష్టంగా ఐదుగురు వయోజన యాత్రికులు కలిసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. యాత్రికుల సౌకర్యార్థం దరఖాస్తుదారులను కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా విభజించారు.
65 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులు తమతో పాటు సహాయకుడిగా 65 ఏళ్ల లోపు ఉన్న ఒక వ్యక్తిని తీసుకెళ్లవచ్చు. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారిని ఎలాంటి డ్రా లేకుండానే నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు. 'మెహ్రమ్' (తోడుగా వచ్చే పురుషుడు) లేకుండా ఒంటరిగా ప్రయాణించాలనుకునే 45 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేక కేటగిరీని కేటాయించారు. నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకున్న ఈ మహిళలను కూడా ఎటువంటి డ్రా లేకుండానే యాత్రకు ఎంపిక చేయనున్నారు.
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే వారు కేంద్ర హజ్ కమిటీ (Haj Committee of India) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వైద్య ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ, ఆధార్ కార్డ్, సరైన సమాచారంతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన యాత్రికులకు హైదరాబాద్లోని హజ్ హౌస్ వేదికగా ప్రత్యేక శిక్షణా శిబిరాలను, వైద్య పరీక్షలను తెలంగాణ హజ్ కమిటీ నిర్వహించనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నాంపల్లిలోని హజ్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
{{/usCountry}}హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే వారు కేంద్ర హజ్ కమిటీ (Haj Committee of India) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వైద్య ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ, ఆధార్ కార్డ్, సరైన సమాచారంతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన యాత్రికులకు హైదరాబాద్లోని హజ్ హౌస్ వేదికగా ప్రత్యేక శిక్షణా శిబిరాలను, వైద్య పరీక్షలను తెలంగాణ హజ్ కమిటీ నిర్వహించనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నాంపల్లిలోని హజ్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
{{/usCountry}}