అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం - సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వక్ఫ్ ఆస్తులను కూటమి ప్రభుత్వం కాపాడుతోందన్నారు. 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు.
ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు.

విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం" అని వివరించారు.
పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్దులకు తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు.
బకాయిలు విడుదల చేయండి - సీఎం ఆదేశాలు
"పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు 19,215 మందికి రూ.264 కోట్లు విడుదల చేశాం. దీపం-2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనంగా రూ.180 కోట్లు అందించాం. మరో రూ.45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాను.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
“అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నాం. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాం. 347 మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నాం. 33,275 మందికి ఆర్ధిక చేయూత కింద రూ.193 కోట్లు ఇచ్చాం. యువతకు నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం. ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డును పునర్వవ్యస్తీకరణ చేశాం. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశాం. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నాం. నూర్ బాషా ఫెడరేషన్ పేరును దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పోరేషనుగా మార్పు చేసి రూ.100 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్లో మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఉర్దూ అకాడమీకి కూటమి ప్రభుత్వంలో రూ.7 కోట్లు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అబ్దుల్ హక్ అవార్డు కింద రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఉర్దూ ఘర్, షాధీ ఖానాల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించామని ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

