పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. విద్యాశాఖ తరఫున వచ్చే ఆధార్ ఆపరేటర్లను తమ ప్రాంగణాల్లో క్యాంపులు నిర్వహించేందుకు అనుమతించని పాఠశాలలు, జూనియర్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విద్యాశాఖ డిప్యుటేషన్‌పై నియమించిన ఆపరేటర్ల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు UDISE+ పోర్టల్‌లోకి లాగిన్ అయి, తమ పాఠశాల/కళాశాలలో ఏ విద్యార్థులకు బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో జాబితాను సరిచూసుకోవాలి.
నిర్దేశిత వయోపరిమితి (సాధారణంగా 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సు దాటిన విద్యార్థులు) పూర్తి చేసుకున్న వారు తమ వేలిముద్రలు, కంటిపాప స్క్యాన్ (Iris Scan), తాజా ఫోటోగ్రాఫ్‌ను విధిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి ఎంట్రెన్స్ టెస్టులతో పాటు వివిధ రకాల ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, విద్యా సేవలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి. బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ ప్రాంగణాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించడానికి ఆపరేటర్లను అనుమతించడం లేదని విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఈ విధమైన నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి విద్యాసంస్థలపై సంబంధిత చట్టాలు, రూల్స్ ప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులను ఆదేశించింది.
పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి శరీర నిర్మాణంలో మార్పుల వల్ల వేలిముద్రలు, ఐరిస్ రూపం మారుతాయి. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనల ప్రకారం 5 ఏళ్లు, 15 ఏళ్లు నిండినప్పుడు ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం తప్పనిసరి. విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల ప్రవేశాల సమయంలో ఆధార్ డేటా సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం.
{{/usCountry}}పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి శరీర నిర్మాణంలో మార్పుల వల్ల వేలిముద్రలు, ఐరిస్ రూపం మారుతాయి. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనల ప్రకారం 5 ఏళ్లు, 15 ఏళ్లు నిండినప్పుడు ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం తప్పనిసరి. విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల ప్రవేశాల సమయంలో ఆధార్ డేటా సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం.
{{/usCountry}}