కూలీతో స్కూల్ టీచర్ ఎఫైర్.. భర్తను మర్డర్ చేసి గుండెపోటు అని డ్రామా!

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను అడ్డుగా ఉన్నాడని చంపేసింది. ఆ తర్వాత గుండెపోటు అంటూ డ్రామా చేసింది. కానీ చివరకు దొరికిపోయింది.

Updated on: Dec 23, 2025, 11:00:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అక్రమ సంబంధం కారణంగా జరిగే హత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్న బంధాలను మధ్యలో వచ్చిన వారి కోసం తెంచేసుకుంటున్నారు. జైళ్లకు వెళ్తున్న ఘటనలు చూస్తున్నా.. చాలా మంది ఇలాంటి పనులను మానుకోవడం లేదు. తాజాగా ఓ యువకుడితో అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసింది ఓ మహిళ. అంతేకాదు.. గుండెపోటు అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భర్తను హత్య చేసిన భార్య
భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ బృందావన్‌ కాలనీలో కర్ణాటకకు చెందిన అశోక్ (45), పూర్ణిమ (36)లు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో పెళ్లి అయింది. 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. పూర్ణిమ బోడుప్పల్‌లో ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. గతంలో వేరే ప్రాంతంలో నివసించేవారు. దీనికి కారణం పూర్ణిమకు ఉన్న అక్రమ సంబంధం. గతంలో నివసించిన ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కూలీ 22 ఏళ్ల మహేశ్‌తో పూర్ణిమకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త కొన్ని రోజులకు అక్రమ సంబంధంగా మారింది.

ఈ విషయం భర్త అశోక్‌కు తెలిసి భర్య పూర్ణిమను మందలించాడు. ఇక్కడ ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో బోడుప్పల్ ఈస్ట్ బృందావన్‌ కాలనీకి వెళ్లి నివాసం ఉంటున్నారు. అయిన కూడా పూర్ణిమ తన తీరును మార్చుకోలేదు. అప్పుడప్పుడు ఈ విషయంపై గొడవలు కూడా జరిగేవి.

తమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని.., ప్రియుడు మహేశ్‌తో చెప్పింది. ఇద్దరు కలిసి అశోక్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్లాన్ వేశారు. మహేశ్ తన స్నేహితుడు భుక్యా సాయికుమార్ సాయం తీసుకున్నాడు. డిసెంబర్ 11వ తేదీన అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో మహేశ్, సాయి కుమార్ ఉన్నారు. ఒక్కసారిగా మహేశ్ మీద దాడి చేశారు. నోరు మూసేశారు.

పూర్ణిమ, సాయికుమార్.. అశోక్‌ను కదలకుండా పట్టుకున్నారు. మహేశ్ చున్నీలను అశోక్ మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అశోక్ చనిపోయాక వెళ్లిపోయారు. ఇక పూర్ణిమ తన భర్త చావుపై డ్రామా మెుదలుపెట్టింది. తన భర్త ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఓపిక లేదని పడుకున్నాడని, గుండెపోటు వచ్చిందని అందరికీ చెప్పింది. బంధువులను కూడా నమ్మించింది.

కానీ అప్పటికే అశోక్ శరీరం మీద కొన్ని గాయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులు గమనించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అశోక్ మృతి సమయంలో మహేశ్, సాయి కుమార్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా రికార్డు అయింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More