పెళ్లి కాకముందే తల్లిగా- మోసం చేసే ప్రియుడు- ఇవాళ ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్

ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది. పెళ్లి కాకముందే తల్లిగా మారే అమ్మాయిని ప్రియుడు మోసం చేస్తాడు. దీంతో ఆమె సైకోలా మారిపోతుంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 9, 2025, 11:41:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది. ఉత్కంఠ రేపే స్టోరీ లైన్ తో ీ మూవీ తెరకెక్కింది. అదే ‘డై మై లవ్’. ఈ థ్రిల్లర్ మూవీలో రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లు కూడా ఎక్కువే. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి రిజల్ట్ సాధించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ (x)

డై మై లవ్ ఓటీటీ

అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ డై మై లవ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం (డిసెంబర్ 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ఇప్పుడు రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సినిమా చూడాలంటే రెంట్ గా డబ్బులు పే చేయాల్సిందే. ఈ రోజు నుంచే డిజిటల్ ఆడియన్స్ కోసం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు

డై మై లవ్ సినిమాలో జెన్నిఫర్ లారెన్స్, రాబర్ట్ పాటిన్సన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాలో జెన్నిఫర్ లారెన్స్ నటన క్రిటిక్స్ ను కూడా మెప్పించింది. ఈ చిత్రంలో తన నటనకు గాను ఆమె గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ సంపాదించింది. ఈ అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకు లీన్ రామ్సే డైరెక్టర్. ఇది నవంబర్ 7, 2025న థియేటర్లలో రిలీజైంది.

డై మై లవ్ స్టోరీ

డై మై లవ్ మూవీ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. జాక్సన్ (రాబర్ట్), గ్రేస్ (జెన్నిఫర్) ప్రేమించుకుంటారు. కలిసి డేటింగ్ చేస్తారు. జాక్సన్ కారణంగా గ్రేస్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఓ అబ్బాయికి జన్మనిస్తుంది. ఆ తర్వాత గ్రేస్, జాక్సన్ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. జాక్సన్ వేరే అమ్మాయిలో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని గ్రేస్ కనిపెడుతుంది.

గ్రేస్ ను ఇంట్లో వదిలేసి జాక్సన్ బయట టూర్లకు వెళ్తుంటాడు. దీంతో ఒంటరితనం, మోసపోయాననే భావనతో గ్రేస్ సైకోలా మారుతుంది. ఇంట్లో, బయట అడవిలొ తనకు తానే మాస్టర్బేట్ చేసుకుంటుంది. జాక్సన్ ఓ కుక్కను తెస్తే దాన్ని గ్రేస్ షూట్ చేసి చంపేస్తుంది. అయితే గ్రేస్ ను పెళ్లి చేసుకుంటానని జాక్సన్ అడుగుతాడు. కానీ వెడ్డింగ్ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

గ్రేస్ నగ్నంగా అడవిలోకి వెళ్తుంది. అక్కడ మంటల్లోకి దూకబోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గ్రేస్ మాములు మనిషి అయిందా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More