శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ ప్రాంతాల నుంచి కేరళలోని కొల్లం వరకు మొత్తంగా 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు వచ్చే ఏడాది జనవరి మాసంలోనూ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

రైలు నెంబర్ 07193 హైదరాబాద్ - కొల్లం ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 4 సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 5, 12, 19, 26 (శనివారాలు) రైళ్లు ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి 11:10కి బయల్దేరి, సోమవారం ఉదయం 7:15కి కొల్లం చేరుకుంటుంది.
07194 కొల్లం - హైదరాబాద్ మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 4 సర్వీసులు డిసెంబర్ 7, 14, 21, 28 (సోమవారాలు) తేదీల్లో ఉంటాయి. కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6:30కి హైదరాబాద్ చేరుకుంటుంది.
07180 చర్లపల్లి - కొల్లం సర్వీస్ నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 6 సర్వీసులు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 (శుక్రవారాలు) తేదీల్లో నడుస్తాయి. చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, ఆదివారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.
07181 కొల్లం - చర్లపల్లి ట్రైన్ మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 6నవంబర్ 22, 29; డిసెంబర్ 6, 13, 20, 27 (ఆదివారాలు): కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7:00కి చర్లపల్లి చేరుకుంటుంది.
07195 చర్లపల్లి - కొల్లం నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 9 సర్వీసులు నడుస్తాయి. నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 (ఆదివారాలు) చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, మంగళవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.
07196 కొల్లం - చర్లపల్లి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 9 సర్వీసులు నడుస్తాయి. నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 (మంగళవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.
{{/usCountry}}07196 కొల్లం - చర్లపల్లి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 9 సర్వీసులు నడుస్తాయి. నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 (మంగళవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.
{{/usCountry}}07197 చర్లపల్లి - కొల్లం నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 4 సర్వీసులు ఉన్నాయి. డిసెంబర్ 2, 9, 16, 23 (బుధవారాలు) తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, శుక్రవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.
07198 కొల్లం - చర్లపల్లి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 4 సర్వీసులు నడవనున్నాయి. డిసెంబర్ 4, 11, 18, 25 (శుక్రవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7:00కి చర్లపల్లి చేరుకుంటుంది.
07199 చర్లపల్లి - కొల్లం కాజీపేట మీదుగా 3 సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 30, జనవరి 6, 13 (బుధవారాలు), చర్లపల్లిలో రాత్రి 10:40కి బయల్దేరి, శుక్రవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.
07200 కొల్లం - చర్లపల్లి ట్రైన్ కాజీపేట మీదుగా 3 సర్వీసులు అందిస్తుంది. జనవరి 1, 8, 15 (శుక్రవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.
07189 నాందేడ్ - కొల్లం స్పెషల్ ట్రైన్ నవంబర్ 15 (ఆదివారం - ఒక్క రోజు మాత్రమే)న సర్వీసు అందిస్తుంది. నాందేడ్‌లో సాయంత్రం 5:15కి బయల్దేరి, మంగళవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.
07190 కొల్లం - చర్లపల్లి ఒక సర్వీసు నవంబర్ 17న ఉంటుంది. కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ఒకటి రెండు సర్వీసులలో పూర్తిగా ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండగా, మెజారిటీ రైళ్లలో భక్తుల బడ్జెట్‌కు అనుగుణంగా ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. శబరిమల సీజన్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. భక్తులు ముందుగానే ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా గానీ తమ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.