ఇక సూపర్ ఫాస్ట్ గా చర్లపల్లి - తిరుచానూర్ రైలు... తగ్గనున్న జర్నీ టైమ్, మార్పులు ఇలా..

చర్లపల్లి-తిరుచానూర్ రైలును సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి కొత్త నంబర్లు, మారిన వేళలు అమల్లోకి రానున్నాయి. 

Published on: Nov 11, 2026, 07:07:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చర్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ఈ మార్గంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని పెంచడంతో పాటు…. దానికి ‘సూపర్‌ఫాస్ట్’ హోదాను కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

చర్లపల్లి-తిరుచానూర్‌ రైలు ఇక సూపర్‌ఫాస్ట్‌
చర్లపల్లి-తిరుచానూర్‌ రైలు ఇక సూపర్‌ఫాస్ట్‌

రైలు నంబర్లు - వేళల్లో మార్పులు

సూపర్‌ఫాస్ట్ కేటగిరీకి మార్చిన నేపథ్యంలో ఈ రైళ్ల నంబర్లలో కూడా మార్పులు చేశారు. ఈ కొత్త నిబంధనలు, వేళలు 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

  • చర్లపల్లి - తిరుచానూర్ (రైలు నంబరు: 12729) : ఇప్పటివరకు 17047 నంబర్‌తో నడుస్తున్న చర్లపల్లి-తిరుచానూర్ ఎక్స్‌ప్రెస్ ఇకపై 12729 నంబరుతో సేవలు అందిస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ చర్లపల్లిలో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు తిరుచానూర్ చేరుకుంటుంది. దీని నిష్క్రమణ, చేరుకునే సమయాల్లో ఎలాంటి మార్పు లేదు.
  • తిరుచానూర్ - చర్లపల్లి (రైలు నంబరు: 12730) : ప్రస్తుతం 17048 నంబర్‌తో నడుస్తున్న తిరుచానూర్-చర్లపల్లి రైలు నంబరు 12730గా మారనుంది. ఈ రైలు తిరుచానూర్‌లో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకే చర్లపల్లికి చేరుకుంటుంది. వేగం పెంచడం వల్ల ఇప్పటివరకు ఉదయం 7.00 గంటలకు చేరుకునే ఈ రైలు, ఇకపై ఒక గంట ముందుగానే గమ్యస్థానానికి చేరుకోనుంది.

6 సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు

ఒకవైపు చర్లపల్లి రైలుకు సూపర్‌ఫాస్ట్ హోదా కల్పించగా….. మరోవైపు జోన్ పరిధిలో నడిచే ఆరు సూపర్‌ఫాస్ట్ రైళ్లను సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పులు 2027 జనవరి 2 మరియు 3 తేదీల నుంచి అమల్లోకి వస్తాయి.

  • హైదరాబాద్ – ముంబయి సీఎస్టీ : ప్రస్తుతం ఉన్న 22731 నంబరు ఇకపై 17081గా మారుతుంది.
  • ముంబయి సీఎస్టీ – హైదరాబాద్: 22732 నంబరు ఇకపై 17082గా నడుస్తుంది.
  • కాచిగూడ – కుంతా: 12789 నంబరు 17689గా మారుతుంది. కుంతా – కాచిగూడ: 12790 నంబరు 17690గా మారనుంది.
  • నర్సాపూర్ – నాగర్‌సోల్: 12787 నంబరు 17241గా నడుస్తుంది.
  • నాగర్‌సోల్ – నర్సాపూర్: 12788 నంబరు ఇకపై 17242గా సేవలందిస్తుంది.

ప్రయాణికులు ఈ నంబర్లు, సమయాల్లో వచ్చిన మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More