అయ్యప్ప భక్తులకు రైల్వే అప్డేట్.. ఏపీ, తెలంగాణ మీదుగా 54 స్పెషల్ ట్రైన్స్

Sabarimala Special Trains : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ నుంచి కొల్లం వరకు 54 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నడిచే ఈ రైళ్ల పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ చూడండి.

Published on: Nov 12, 2026, 20:12:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ ప్రాంతాల నుంచి కేరళలోని కొల్లం వరకు మొత్తంగా 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు వచ్చే ఏడాది జనవరి మాసంలోనూ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

శబరిమలకు స్పెషల్ ట్రైన్స్
శబరిమలకు స్పెషల్ ట్రైన్స్

రైలు నెంబర్ 07193 హైదరాబాద్ - కొల్లం ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 4 సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 5, 12, 19, 26 (శనివారాలు) రైళ్లు ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి 11:10కి బయల్దేరి, సోమవారం ఉదయం 7:15కి కొల్లం చేరుకుంటుంది.

07194 కొల్లం - హైదరాబాద్ మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 4 సర్వీసులు డిసెంబర్ 7, 14, 21, 28 (సోమవారాలు) తేదీల్లో ఉంటాయి. కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6:30కి హైదరాబాద్ చేరుకుంటుంది.

07180 చర్లపల్లి - కొల్లం సర్వీస్ నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 6 సర్వీసులు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 (శుక్రవారాలు) తేదీల్లో నడుస్తాయి. చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, ఆదివారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.

07181 కొల్లం - చర్లపల్లి ట్రైన్ మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 6నవంబర్ 22, 29; డిసెంబర్ 6, 13, 20, 27 (ఆదివారాలు): కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7:00కి చర్లపల్లి చేరుకుంటుంది.

07195 చర్లపల్లి - కొల్లం నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 9 సర్వీసులు నడుస్తాయి. నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 (ఆదివారాలు) చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, మంగళవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.

07196 కొల్లం - చర్లపల్లి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 9 సర్వీసులు నడుస్తాయి. నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 (మంగళవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.

07197 చర్లపల్లి - కొల్లం నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 4 సర్వీసులు ఉన్నాయి. డిసెంబర్ 2, 9, 16, 23 (బుధవారాలు) తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 11:45కి బయల్దేరి, శుక్రవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.

07198 కొల్లం - చర్లపల్లి మిర్యాలగూడ, నల్గొండ మీదుగా 4 సర్వీసులు నడవనున్నాయి. డిసెంబర్ 4, 11, 18, 25 (శుక్రవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7:00కి చర్లపల్లి చేరుకుంటుంది.

07199 చర్లపల్లి - కొల్లం కాజీపేట మీదుగా 3 సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 30, జనవరి 6, 13 (బుధవారాలు), చర్లపల్లిలో రాత్రి 10:40కి బయల్దేరి, శుక్రవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.

07200 కొల్లం - చర్లపల్లి ట్రైన్ కాజీపేట మీదుగా 3 సర్వీసులు అందిస్తుంది. జనవరి 1, 8, 15 (శుక్రవారాలు) తేదీల్లో కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.

07189 నాందేడ్ - కొల్లం స్పెషల్ ట్రైన్ నవంబర్ 15 (ఆదివారం - ఒక్క రోజు మాత్రమే)న సర్వీసు అందిస్తుంది. నాందేడ్‌లో సాయంత్రం 5:15కి బయల్దేరి, మంగళవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది.

07190 కొల్లం - చర్లపల్లి ఒక సర్వీసు నవంబర్ 17న ఉంటుంది. కొల్లంలో ఉదయం 10:55కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7కి చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఒకటి రెండు సర్వీసులలో పూర్తిగా ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండగా, మెజారిటీ రైళ్లలో భక్తుల బడ్జెట్‌కు అనుగుణంగా ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. శబరిమల సీజన్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. భక్తులు ముందుగానే ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా గానీ తమ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More