సెంట్రల్ రైల్వే పరిధిలోని పుణె, హడ్ప్సర్ (Hadapsar) యార్డ్‌లలో 3వ రైల్వే లైన్ కమిషనింగ్ కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
రైళ్ల మళ్లింపు

కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ ఎక్స్‌ప్రెస్ (11302) సెప్టెంబర్ 22న బయలుదేరే రైలు సోలాపూర్-కుర్దువాడి-మిరజ్-సతారా-పుణె మీదుగా నడుస్తుంది.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22159) సెప్టెంబర్ 19 నుండి 23 వరకు, అక్టోబర్ 4న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్-దౌండ్ మీదుగా వెళ్తుంది.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - భువనేశ్వర్ న్యూ (11019) సెప్టెంబర్ 20న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా నడుస్తుంది.
నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ (16340) సెప్టెంబర్ 22, అక్టోబర్ 02 తేదీలలో సోలాపూర్-కుర్దువాడి-దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-నాసిక్-కళ్యాణ్ మీదుగా మళ్లిస్తారు.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్‌టీటీ (12164) అక్టోబర్ 02, 03 తేదీలలో సోలాపూర్-దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మార్గంలో వెళ్తుంది.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - బీదర్ ఎక్స్‌ప్రెస్ (22143) అక్టోబర్ 03న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా నడుస్తుంది.
సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (22718) అక్టోబర్ 03న సోలాపూర్-కుర్దువాడి-మిరజ్-సతారా-పుణె మీదుగా నడుస్తుంది.
ముంబై ఎల్‌టీటీ - కోయంబత్తూర్ (11013) అక్టోబర్ 03న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా వెళ్తుంది.
తిరువనంతపురం - ముంబై ఎల్‌టీటీ (16332) అక్టోబర్ 03న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా నడుస్తుంది.
ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ (17222) సెప్టెంబర్ 20న పుణె-సతారా-మిరజ్-పండరీపూర్-కుర్దువాడి-సోలాపూర్ మీదుగా మళ్లిస్తారు.
కోయంబత్తూర్ - ముంబై ఎల్‌టీటీ (11014) అక్టోబర్ 03న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా నడుస్తుంది.
{{/usCountry}}కోయంబత్తూర్ - ముంబై ఎల్‌టీటీ (11014) అక్టోబర్ 03న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా నడుస్తుంది.
{{/usCountry}}విశాఖపట్నం - ముంబై ఎల్‌టీటీ (18519) అక్టోబర్ 02న దౌండ్-అహల్యనగర్-మన్మాడ్-ఇగత్‌పురి-కళ్యాణ్ మీదుగా వెళ్తుంది.
ముంబై ఎల్‌టీటీ - విశాఖపట్నం (18520) అక్టోబర్ 04న కళ్యాణ్-ఇగత్‌పురి-మన్మాడ్-అహల్యనగర్-దౌండ్ మీదుగా నడుస్తుంది.
పాక్షికంగా రద్దయిన రైళ్లు
కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ (11302) అక్టోబర్ 03న బయలుదేరే రైలు సోలాపూర్ వరకే పరిమితమవుతుంది.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - కేఎస్‌ఆర్ బెంగళూరు (11301) అక్టోబర్ 04న ఈ రైలు ముంబైకి బదులుగా సోలాపూర్ నుంచే ప్రయాణం ప్రారంభిస్తుంది.
కాజీపేట - హడ్ప్సర్ ఎక్స్‌ప్రెస్ (17014) సెప్టెంబర్ 19, 21, 24, 26, 28, అక్టోబర్ 01 తేదీల్లో దౌండ్ వరకే, అక్టోబర్ 03న కుర్దువాడి వరకే నడుస్తుంది.
హడ్ప్సర్ - కాజీపేట ఎక్స్‌ప్రెస్ (17013) సెప్టెంబర్ 20, 22, 25, 27, 29, అక్టోబర్ 02 తేదీల్లో దౌండ్ నుండి, అక్టోబర్ 04న కుర్దువాడి స్టేషన్ నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.
మార్గమధ్యంలో నిలిపివేసే రైళ్లు
నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16340) సెప్టెంబర్ 18, 21, 23, 25, 28, 29, 30 తేదీలలో ప్రయాణించే రైలును పటాస్ – ఉరులి సెక్షన్ పరిధిలో నిలిపివేస్తారు.
తిరువనంతపురం సెంట్రల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16332) సెప్టెంబర్ 19, 26 తేదీల్లో ఈ రైలు పటాస్ – ఉరులి మధ్య ఆలస్యంగా సాగుతుంది.
నాగర్‌కోయిల్ - ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (16352) సెప్టెంబర్ 20, 24, 27, అక్టోబర్ 01 తేదీలలో పటాస్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.
కేఎస్‌ఆర్ బెంగళూరు - ముంబై సీఎస్‌ఎమ్‌టీ (11302) సెప్టెంబర్ 18 నుండి 21 వరకు, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 02 వరకు పటాస్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22159) సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 02 వరకు చించ్వాడ్ – ఖడ్కీ సెక్షన్‌లో నిలిపివేస్తారు.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - భువనేశ్వర్ న్యూ ఎక్స్‌ప్రెస్ (11019) సెప్టెంబర్ 19, 21, 22, 23, అక్టోబర్ 03, 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ మధ్య నిలిపివేస్తారు.
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (22732) సెప్టెంబర్ 19, 21 నుండి 23 వరకు, అక్టోబర్ 03, 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ సెక్షన్‌లో నిలిపివేస్తారు.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (20953) సెప్టెంబర్ 20న బయలుదేరే రైలును పటాస్ – ఉరులి వద్ద 1 గంట 20 నిమిషాలు నిలిపివేస్తారు.
ముంబై ఎల్‌టీటీ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22179) సెప్టెంబర్ 21న చించ్వాడ్ – ఖడ్కీ మధ్య 45 నిమిషాలు ఆపుతారు.
ముంబై ఎల్‌టీటీ - కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్ (11017) సెప్టెంబర్ 19, అక్టోబర్ 03 తేదీల్లో చించ్వాడ్ – ఖడ్కీ వద్ద నిలిపివేస్తారు.
ముంబై ఎల్‌టీటీ - మదురై ఎక్స్‌ప్రెస్ (22101) సెప్టెంబర్ 23న చించ్వాడ్ – ఖడ్కీ సెషన్‌లో 1 గంట 15 నిమిషాల పాటు ఆపుతారు.
మదురై - ముంబై ఎల్‌టీటీ (22102) సెప్టెంబర్ 18, అక్టోబర్ 02 తేదీల్లో పటాస్ – ఉరులి వద్ద నిలిపివేస్తారు.
నిజామాబాద్ - పుణె ఎక్స్‌ప్రెస్ (11410) సెప్టెంబర్ 22, అక్టోబర్ 02 తేదీలలో పటాస్ – ఉరులి సెక్షన్‌లో 1 గంట 30 నిమిషాలు నిలిపివేస్తారు.
జైపూర్ - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ (20668) అక్టోబర్ 03న చించ్వాడ్ – ఖడ్కీ మధ్య 30 నిమిషాలు నిలిపివేస్తారు.
అమరావతి - పుణె ఎక్స్‌ప్రెస్ (11406) సెప్టెంబర్ 19, 21 తేదీలలో దౌండ్ – ఉరులి సెక్షన్‌లో నిలిపివేస్తారు.
పన్వేల్ - హెచ్.ఎస్.నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (17613) సెప్టెంబర్ 20, అక్టోబర్ 04 తేదీలలో చించ్వాడ్ – ఖడ్కీ వద్ద నిలిపివేస్తారు.
కారైక్కాల్ - ముంబై ఎల్‌టీటీ (11018) సెప్టెంబర్ 21న దౌండ్ – లోణి సెక్షన్‌లో 1 గంట 40 నిమిషాల పాటు ఆపుతారు.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
ముంబై సీఎస్‌ఎమ్‌టీ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (22732) సెప్టెంబర్ 20, 2026న ముంబై సీఎస్‌ఎమ్‌టీ నుండి మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరుతుంది.
అమరావతి - పుణె ఎక్స్‌ప్రెస్ (11406) అక్టోబర్ 03, 2026న అమరావతి నుండి రాత్రి 7:50 గంటలకు బదులుగా 3 గంటలు ఆలస్యంగా రాత్రి 10:50 గంటలకు బయలుదేరుతుంది.
ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ (17222) అక్టోబర్ 04, 2026న ముంబై ఎల్‌టీటీ నుండి మధ్యాహ్నం 01:15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 2 గంటలు ఆలస్యంగా 03:15 గంటలకు బయలుదేరుతుంది.