అదనపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనుంది. తిరుమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

07819 చర్లపల్లి-తిరుపతి 25.06.2026, 27.06.2026 తేదీల్లో గురు, శనివారం రెండు సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 07:30కి తిరుపతి చేరుకుంటుంది.
07820 తిరుపతి-చర్లపల్లి 26.06.2026, 28.06.2026 తేదీల్లో శుక్ర, ఆది వారాల్లో 2 సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4:30కి చర్లపల్లికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
జల్నా-యెలహంక వయా సికింద్రాబాద్
ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే జల్నా యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ ట్రైన్ వయా సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఈ ట్రైన్ సర్వీస్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
07601 జల్నా - యెలహంక 28.06.2026 నుంచి 26.07.2026 మధ్య నడుస్తోంది. ఆదివారాల్లో జల్నా నుంచి రాత్రి 7.20కి బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 9.30కి యెలహంక చేరుకుంటుంది. మెుత్తం 5 సర్వీసులు నడుస్తాయి.
07602 యెలహంక - జల్నా 29.06.2026 నుండి 27.07.2026 వరకు నడుస్తుంది. సోమవారం 11.30 యెలహంక నుంచి బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటలు జల్నా చేరుకుంటుంది. ఇది కూడా 5 సర్వీసులు నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు పర్చూర్, సెల్లు, పర్భాని, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోలారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం, ధర్మారం గుండాల్, ధర్మాపూర్ రోడ్డు, అదోని, హిందూపూర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు పర్చూర్, సెల్లు, పర్భాని, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోలారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం, ధర్మారం గుండాల్, ధర్మాపూర్ రోడ్డు, అదోని, హిందూపూర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
{{/usCountry}}