South Central Railway Freight Network : దక్షిణ మధ్య రైల్వే (SCR) తన సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ, సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. రైల్వే నెట్‌వర్క్ ద్వారా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేయడానికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి, జానకంపేట రైల్వే స్టేషన్ల నుంచి సరికొత్త వస్తువుల లోడింగ్‌ను రైల్వే శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఈ సరికొత్త చొరవ అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు రైతులకు ఎంతగానో లబ్ధి చేకూర్చనుంది.
వెల్దుర్తి నుంచి ఇనుము, ఉక్కు రవాణా:

కర్నూలు జిల్లా పరిధిలోని వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రత్యేకమైన కంటైనర్ టెర్మినల్‌ను (ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ చరిత్రలోనే తొలిసారిగా… స్థానిక ఉక్కు కర్మాగారంలో తయారైన పిగ్ ఐరన్, టీఎంటీ స్టీల్ బార్లతో కూడిన మొదటి కంటైనర్ రేక్‌ను ఇక్కడి నుంచి లోడ్ చేశారు. ఈ సరుకును దేశంలోని కీలక పారిశ్రామిక నగరాలైన ఢిల్లీ, ముంబైతో పాటు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు రవాణా చేయనున్నారు. వెల్దుర్తిలో అందుబాటులోకి వచ్చిన ఈ టెర్మినల్ ద్వారా పరిశ్రమలకు అత్యంత వేగవంతమైన, నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యం లభించినట్లయింది.
జానకంపేట నుంచి తెలంగాణ మక్కలు:
మరోవైపు నిజామాబాద్ జిల్లా పరిధిలోని జానకంపేట స్టేషన్‌ను గూడ్స్ రవాణాకు అనుకూలంగా మారుస్తూ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్ నుంచి తొలిసారిగా 21 వ్యాగన్లతో కూడిన మినీ రేక్‌లో మొక్కజొన్నను (మక్కలు) విజయవంతంగా లోడ్ చేశారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులు తమ పంటను అత్యంత తక్కువ ఖర్చుతో, సురక్షితంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి రవాణా చేసుకునే అవకాశం కలిగింది. ఇది మరాఠ్వాడా ప్రాంత ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడమే కాకుండా, మన రైతులకు మంచి మద్దతు ధర లభించేలా చేస్తుంది.
రైల్వే జోన్ పరిధిని విస్తరిస్తూ…. కొత్త రకమైన సరుకు రవాణాను విజయవంతంగా ప్రారంభించిన హైదరాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జోన్ విభజన జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో ఇదే వేగాన్ని, పట్టును కొనసాగించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}రైల్వే జోన్ పరిధిని విస్తరిస్తూ…. కొత్త రకమైన సరుకు రవాణాను విజయవంతంగా ప్రారంభించిన హైదరాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జోన్ విభజన జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో ఇదే వేగాన్ని, పట్టును కొనసాగించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}