ఇండియన్ రైల్వేస్ బిగ్ డెసిషన్.. ఆగస్టు నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌కు కొత్త సిస్టమ్
Railway Ticket Booking : నాలుగు దశాబ్దాల తర్వాత రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసేందుకు రైల్వేశాఖ రెడీ అయింది. ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్‌కు కొత్త పీఆర్‌ఎస్(ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) వస్తుంది.
భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రైలు టికెట్ల బుకింగ్‌లో దశాబ్దాలుగా వేధిస్తున్న సర్వర్ క్రాష్‌లు, పేమెంట్ ఫెయిల్యూర్స్, వెబ్‌సైట్ స్లో అవ్వడం వంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది. 1986 నుండి అమల్లో ఉన్న పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది.

ఈ కొత్త అప్‌గ్రేడ్ ద్వారా ఒకేసారి లక్షలాది మంది ప్రయాణికులు లాగిన్ అయినా సర్వర్లు ఏమాత్రం హ్యాంగ్ అవ్వకుండా, కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ ఈ మౌలిక వసతులను బలోపేతం చేసింది. పాత సిస్టమ్ నుండి కొత్త సిస్టమ్‌లోకి మారే క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అప్‌గ్రేడ్ ప్రక్రియను అత్యంత సాఫీగా పూర్తి చేస్తున్నారు అధికారులు.
భారతీయ రైల్వే తొలిసారిగా 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఆన్‌లైన్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. రైల్వేలో అమ్ముడవుతున్న మొత్తం టికెట్లలో దాదాపు 88 శాతం టికెట్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బుక్ అవుతుండటం విశేషం.
రైల్ వన్ యాప్
రైల్వే శాఖ గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన Rail One యాప్ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ యాప్ ఏకంగా 3.5 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజుకు సగటున 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌లో ప్రయాణికులకు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.
సులభంగా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ చేసుకోవడం, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ (రైలు ఎక్కడుందో లైవ్‌లో చూడటం), ప్లాట్‌ఫారమ్ వివరాలు తెలుసుకోవడం, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు చేయడంలాంటి సేవలు రైల్ వన్ యాప్‌లో ఉన్నాయి.
కచ్చితత్వంతో ఏఐ వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్!
ఈ ఏడాది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరో సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్ టూల్'ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనేది ముందే ఊహించవచ్చు. గతంలో దీని కచ్చితత్వం కేవలం 53 శాతంగానే ఉండేది, కానీ ఇప్పుడది ఏకంగా 94 శాతానికి మెరుగైంది.
ఈ సరికొత్త ఏఐ టూల్ వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోవడానికి, కన్ఫర్మేషన్‌పై ఉన్న అంచనాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ భారతదేశ డిజిటల్ రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని రైల్వే అధికారులు నమ్మకంగా చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


