చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా ఈ రూట్‌లో నడిచే రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలేంటో చూడండి.

ట్రైన్ నెంబర్ 03253 పాట్నా – చర్లపల్లి సోమ, బుధవారాల్లో నడుస్తుంది. 03.08.2026 నుంచి 16.09.2026 వరకు 14 సర్వీసులు నడవనున్నాయి.
ట్రైన్ నెంబర్ 03254 చర్లపల్లి-పాట్నా బుధవారాల్లో 05.08.2026 నుంచి 16.09.2026 మధ్య 7 సర్వీసులు నడుస్తాయి.
రైలు నెంబర్ 03255 చర్లపల్లి- పాట్నా శుక్రవారాల్లో 07.08.2026 నుంచి 18.09.2026 మధ్య 7 సర్వీసులు నడుస్తాయి.
ఉద్యోగి ఆఫ్ ది మంత్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో 2026 జూన్ నెలకు గాను ఐదుగురు ఉద్యోగులకు “ఎంప్లాయి ఆఫ్ ది మంత్” భద్రతా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఎస్.సి.ఆర్ అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనే మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
విధి పట్ల ఆదర్శప్రాయమైన నిబద్ధతను కనబరుస్తూ, అప్రమత్తంగా ఉంటూ అసురక్షిత పరిస్థితులను నివారించిన సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్‌లకు చెందిన ఐదుగురు ఉద్యోగులకు 'ఎంప్లాయి ఆఫ్ ది మంత్' అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఉద్యోగులు ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మెన్, సీనియర్ టెక్నీషియన్, స్టేషన్ మాస్టర్ వంటి వివిధ భద్రతా విభాగాలకు చెందినవారు. జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తించినందుకు వారిని ప్రశంసించారు.
భద్రతా సమావేశం సందర్భంగా ఇంజనీరింగ్, ఆపరేటింగ్, కమర్షియల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మొదలైన విభాగాల సీనియర్ అధికారులు నిర్వహించిన విభాగాల వారీ రాత్రి తనిఖీలను సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఈ తనిఖీల సమయంలో గమనించిన విషయాలు, గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న దిద్దుబాటు చర్యలపై ఆయన సవివరంగా సమీక్షించారు. జోన్ అంతటా నిరంతర పర్యవేక్షణ, అత్యున్నత భద్రతా ప్రమాణాలపై జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు.
{{/usCountry}}భద్రతా సమావేశం సందర్భంగా ఇంజనీరింగ్, ఆపరేటింగ్, కమర్షియల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మొదలైన విభాగాల సీనియర్ అధికారులు నిర్వహించిన విభాగాల వారీ రాత్రి తనిఖీలను సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఈ తనిఖీల సమయంలో గమనించిన విషయాలు, గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న దిద్దుబాటు చర్యలపై ఆయన సవివరంగా సమీక్షించారు. జోన్ అంతటా నిరంతర పర్యవేక్షణ, అత్యున్నత భద్రతా ప్రమాణాలపై జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు.
{{/usCountry}}వర్షాకాలంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న రోడ్డు అండర్ బ్రిడ్జిల వద్ద అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. బారికేడ్ల ఏర్పాటు, ఇరవై నాలుగు గంటలూ వాచ్‌మెన్‌ల మోహరింపు, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి నాలుగు గంటలకు ఫోటోలను పంచుకోవడం వంటి అమలులో ఉన్న వివిధ ముందుజాగ్రత్త చర్యల గురించి డివిజనల్ రైల్వే మేనేజర్లు వివరించారు.