Festival Special Trains : ప్రయాణికులకు అలర్ట్... చర్లపల్లి - నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లు! ఏపీలోని హాల్ట్ లిస్ట్ ఇద
SCR Festival Special Trains : పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు చర్లపల్లి - నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ సేవలు సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
SCR Festival Special Trains : రాబోయే పండుగల సీజన్‌లో సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి మరియు తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

పండుగ సమయంలో పెరిగే ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రయాణం సౌకర్యవంతంగా సాగేలా చేయడానికి ఇరు మార్గాల్లో చెరో 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 25 వరకు పట్టాలెక్కనున్నాయి.
రైళ్ల షెడ్యూల్ - నడిచే తేదీలు :
- రైలు నంబర్ 07535 (చర్లపల్లి - నాగర్‌కోయిల్) : ఈ ప్రత్యేక రైలు చార్లపల్లి నుంచి ప్రతి వారం శుక్రవారం రోజున బయలుదేరుతుంది. సెప్టెంబర్ 25, 2026 నుంచి అక్టోబర్ 23, 2026 వరకు మొత్తం 5 ట్రిప్పులు నడుస్తుంది.
- రైలు నంబర్ 07536 (నాగర్‌కోయిల్ - చర్లపల్లి): తిరుగు ప్రయాణంలో ఈ రైలు నాగర్‌కోయిల్ నుంచి ప్రతి వారం ఆదివారం రోజున బయలుదేరుతుంది. సెప్టెంబర్ 27, 2026 నుంచి అక్టోబర్ 25, 2026 వరకు మొత్తం 5 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
రైలు నిలిచే ప్రధాన స్టేషన్లు….
ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ ఇరువైపులా పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు.
ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ఈ రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లుంటాయి. పండుగ ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ఉపయోగించుకుని ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

