దసరా, దీపావళి వంటి ప్రముఖ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంగళూరు క్యాంట్ - బీదర్, అలాగే యశ్వంతపూర్ - సహర్సా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి.
06589 బెంగళూరు క్యాంట్ – బీదర్ స్పెషల్ ట్రైన్స్ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 వరకు రెండు సర్వీసులు నడుస్తాయి.
06590 బీదర్ – బెంగళూరు క్యాంట్ అక్టోబర్ 10నుంచి అక్టోబర్ 17 వరకు రెండు సర్వీసులు నడుపుతారు.
06581 యశ్వంతపూర్ – సహర్సా అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.
06582 సహర్సా – యశ్వంతపూర్ అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 12 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.
బెంగళూరు క్యాంట్ – బీదర్ – బెంగళూరు క్యాంట్ స్పెషల్ ట్రైన్స్ (06589 / 06590) ఉత్తర కర్ణాటక, రాయలసీమ ప్రాంత వాసులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు ఇరువైపులా యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబురగి, హుమ్నాబాద్ స్టేషన్లలో నిలుస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
యశ్వంతపూర్ – సహర్సా – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్ (06581 / 06582) కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, బీహార్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు, ముఖ్యంగా పండుగలకు స్వగ్రామాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
{{/usCountry}}యశ్వంతపూర్ – సహర్సా – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్ (06581 / 06582) కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, బీహార్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు, ముఖ్యంగా పండుగలకు స్వగ్రామాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
{{/usCountry}}తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లయిన ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచీగూడ (హైదరాబాద్), కాజీపేట, రామగుండం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇతర ప్రధాన స్టేషన్లు చూసుకుంటే.. యలహంక, హిందూపూర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పూర్, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, హసన్‌పూర్ రోడ్, సలౌనా, ఖగారియా, మాన్సీ, సిమ్రీ భక్తియార్‌పూర్ ఉన్నాయి. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.
పండుగ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల కచ్చితమైన సమయాలు, ప్లాట్‌ఫారమ్ వివరాల కోసం ప్రయాణికులు National Train Enquiry System (NTES) యాప్ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.