ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు-తిన్‌సుకియాకు స్పెషల్ ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు
new tinsukia smvt bengaluru special trains : ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటకలోని బెంగళూరు- అస్సాంలోని తిన్‌సుకియాకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీలో పలు స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి.
పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని తిన్‌సుకియా-కర్ణాటకలోని ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, విజయవాడ, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

ఈ ప్రత్యేక సర్వీసులు మొత్తం 6 ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ కింద పేర్కొన్న సమయాలు, స్టేషన్ల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.
తిన్‌సుకియా – ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు (ట్రైన్ నంబర్: 05952)
అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 12, 2026 వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు తిన్‌సుకియాలో బయలుదేరుతుంది. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు దువ్వాడ చేరుకుని, 3.25 గంటలకు బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 09.30 గంటలకు ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు చేరుకుంటుంది. మొత్తం ట్రిప్పులు 6 ట్రిప్పులు నడుస్తుంది.
ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు – తిన్‌సుకియా (ట్రైన్ నంబర్: 05951)
అక్టోబర్ 12, 2026 నుండి నవంబర్ 16, 2026 వరకు ఈ సర్వీస్ నడుస్తుంది. ప్రతి సోమవారం అర్ధరాత్రి దాటాక (తొలిజామున) 12.05 గంటలకు ఎస్‌ఎమ్‌విటి బెంగళూరులో బయలుదేరుతుంది. సోమవారం రాత్రి 9.15 గంటలకు దువ్వాడ చేరుకుని, 9.20 గంటలకు బయలుదేరుతుంది. బుధవారం సాయంత్రం 4.25 గంటలకు తిన్‌సుకియా చేరుకుంటుంది. మొత్తం 6 ట్రిప్పులు నడుస్తుంది.
ఈ రైళ్లు దిబ్రూగఢ్, ధెమాజీ, నార్త్ లఖింపూర్, హర్ముటి, విశ్వనాథ్ చరాలీ, రంగపారా నార్త్, రంగియా, బర్పెట రోడ్, న్యూ కోక్రాఝర్, న్యూ కూచ్ బెహార్, అలువాబరి, కిషన్ గంజ్, న్యూ ఫరక్కా, రామ్ పూర్ హట్, బోల్ పూర్ శాంతినికేతన్, బర్ధమాన్, డంకుణి, అందూల్, ఖరగ్ పూర్, భద్రక్, జాజ్ పూర్ కియొంఝర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బలుగావ్, బ్రహ్మపూర్ మీదుగా నడుస్తుంది. ఏపీలో పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, బంగార్ పేట, వైట్ ఫీల్డ్, కృష్ణరాజపురంలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక కోచ్‌లను కేటాయించారు. రైలు టికెట్ల రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా బెర్తులను బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


