ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్

Special Trains : పండుగ రద్దీని దృష్టి పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడుస్తాయి.

Published on: Oct 8, 2026, 06:19:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దసరా, దీపావళి వంటి ప్రముఖ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంగళూరు క్యాంట్ - బీదర్, అలాగే యశ్వంతపూర్ - సహర్సా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

స్పెషల్ ట్రైన్స్
స్పెషల్ ట్రైన్స్

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి.

06589 బెంగళూరు క్యాంట్ – బీదర్ స్పెషల్ ట్రైన్స్ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 వరకు రెండు సర్వీసులు నడుస్తాయి.

06590 బీదర్ – బెంగళూరు క్యాంట్ అక్టోబర్ 10నుంచి అక్టోబర్ 17 వరకు రెండు సర్వీసులు నడుపుతారు.

06581 యశ్వంతపూర్ – సహర్సా అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.

06582 సహర్సా – యశ్వంతపూర్ అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 12 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.

బెంగళూరు క్యాంట్ – బీదర్ – బెంగళూరు క్యాంట్ స్పెషల్ ట్రైన్స్ (06589 / 06590) ఉత్తర కర్ణాటక, రాయలసీమ ప్రాంత వాసులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు ఇరువైపులా యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబురగి, హుమ్నాబాద్ స్టేషన్లలో నిలుస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

యశ్వంతపూర్ – సహర్సా – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్ (06581 / 06582) కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, బీహార్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు, ముఖ్యంగా పండుగలకు స్వగ్రామాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లయిన ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచీగూడ (హైదరాబాద్), కాజీపేట, రామగుండం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇతర ప్రధాన స్టేషన్లు చూసుకుంటే.. యలహంక, హిందూపూర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సి, పిపారియా, నర్సింగ్‌పూర్, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, హసన్‌పూర్ రోడ్, సలౌనా, ఖగారియా, మాన్సీ, సిమ్రీ భక్తియార్‌పూర్ ఉన్నాయి. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.

పండుగ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల కచ్చితమైన సమయాలు, ప్లాట్‌ఫారమ్ వివరాల కోసం ప్రయాణికులు National Train Enquiry System (NTES) యాప్ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More