శీతాకాల ప్రయాణ నెలల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. కీలకమైన ప్రాంతీయ మార్గాల్లో రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సుదూర కనెక్టివిటీని సులభతరం చేయడానికి ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-అనకాపల్లి మార్గంలో 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబర్ 4 నుంచి 2026 మార్చి 26 వరకు నడుస్తాయి. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ నుండి అనకాపల్లికి రైలు 07055 డిసెంబర్ 4, 2025 నుండి మార్చి 26, 2026 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు 07056 డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 27, 2026 వరకు నడుస్తాయి.
ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి వంటి ప్రధాన స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి. ఈ సర్వీసులలో 1AC, 2AC, 3AC, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు అనేక రకాల ప్రయాణ ఆప్షన్స్ అందిస్తాయి.
రద్దీగా ఉండే ప్రయాణ వారాల్లో ఉపశమనం అందించడం, సీజన్ అంతటా ప్రయాణికులకు కనెక్టివిటీ ఉండేలా చూడటం ఈ ప్రత్యేక రైళ్ల లక్ష్యం అని రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్‌కు మరో 4 కోచ్‌లు
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిటే వందే భారత్ రైలు 20 బోగీలతో వెళ్లనుంది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిటే వందే భారత్ రైలు 20 బోగీలతో వెళ్లనుంది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జోడిస్తారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్గంలో వందే భారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ద్వారా మొత్తం 660 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉంటాయి.