అయ్యప్ప భక్తులు, శ్రీ సత్యసాయి బాబా భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు శబరిమల మకరవిళక్కు, మండల పూజల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కొల్లం మధ్య అదనపు ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. మరోవైపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ మీదుగా పలు రైళ్ల మళ్లింపుతో పాటు తాత్కాలిక హాల్ట్ సదుపాయాన్ని కల్పించింది.

శబరిమల యాత్రికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి – కొల్లం – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. 07185 చర్లపల్లి – కొల్లం రైలు 22.11.2026 ఆదివారం రాత్రి 11:45కి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 7:55కి కొల్లం చేరుకుంటుంది. 07186 కొల్లం – చర్లపల్లి ట్రైన్ 24.11.2026 మంగళవారం ఉదయం 10:55 కొల్లం నుంచి బయల్దేరి బుధవారం రాత్రి 7 గంటలకు చర్లపల్లికి వస్తుంది.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం స్టేషన్లలో ఆగుతాయి.
29 రైళ్లకు తాత్కాలిక స్టాప్
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు నవంబర్ 23, 2026న పుట్టపర్తిలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో పెనుకొండ – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం – ధర్మవరం మార్గంలో 28 రైళ్లను తాత్కాలికంగా మళ్లించి, ప్రశాంతి నిలయం స్టేషన్‌లో 2 నిమిషాల పాటు అదనపు హాల్ట్ కల్పించారు.
మరోవైపు నవంబర్ 22, 29, 2026 తేదీల్లో ప్రారంభమయ్యే రైలు నంబర్ 11085 (ఎస్ఎంవిటి బెంగళూరు – గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్)కు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో 4 నిమిషాల పాటు తాత్కాలిక హాల్ట్ కల్పించారు. మెుత్తం 29 ట్రైన్లకు హాల్ట్ ఇచ్చారు. ప్రయాణికులు, భక్తులు ఈ మార్పులను గమనించి ముందుగానే తమ టిక్కెట్లను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మరిన్ని వివరాల కోసం 139 హెల్ప్‌లైన్ నంబర్ లేదా అధికారిక వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}మరోవైపు నవంబర్ 22, 29, 2026 తేదీల్లో ప్రారంభమయ్యే రైలు నంబర్ 11085 (ఎస్ఎంవిటి బెంగళూరు – గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్)కు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో 4 నిమిషాల పాటు తాత్కాలిక హాల్ట్ కల్పించారు. మెుత్తం 29 ట్రైన్లకు హాల్ట్ ఇచ్చారు. ప్రయాణికులు, భక్తులు ఈ మార్పులను గమనించి ముందుగానే తమ టిక్కెట్లను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మరిన్ని వివరాల కోసం 139 హెల్ప్‌లైన్ నంబర్ లేదా అధికారిక వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}