దసరా, దీపావళి వంటి రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. వివిధ రాష్ట్రాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి సాసారామ్ మార్గాల్లో వీక్లీ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ - చర్లపల్లి

ఈ ప్రత్యేక రైలు వారానికి ఒకరోజు చొప్పున మొత్తం 7 సర్వీసులు నడవనుంది. రైలు నంబరు 07021 (చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్) అక్టోబర్ 19, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. రైలు నంబరు 07022 (హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి) అక్టోబర్ 21, 2026 నుండి డిసెంబర్ 02, 2026 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.
చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరికొన్ని వీక్లీ ప్రత్యేక రైళ్లను 6 సర్వీసుల పాటు నడుపుతున్నారు. రైలు నంబరు 07023 (చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్) అక్టోబర్ 20, 2026 నుండి నవంబర్ 24, 2026 వరకు ప్రతి మంగళవారం రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నంబరు 07024 (హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి) అక్టోబర్ 22, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
స్టాపేజీలు
ఈ రైళ్లు ఇరువైపులా కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్‌పూర్, ఆగ్రా కాంట్, మధుర, కోసి కలాన్ స్టేషన్లలో నిలుస్తాయి. ఈ రైళ్లలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
చర్లపల్లి - సాసారామ్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు
పండుగ వేళ బీహార్, ఉత్తరప్రదేశ్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి నుంచి సాసారామ్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. రైలు నంబరు 07041(చర్లపల్లి – సాసారామ్) అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి. రైలు నంబరు 07042 (సాసారామ్ – చర్లపల్లి) అక్టోబర్ 09, 2026 నుండి నవంబర్ 27, 2026 వరకు ప్రతి శుక్రవారం మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
స్టాపేజీలు
{{/usCountry}}పండుగ వేళ బీహార్, ఉత్తరప్రదేశ్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి నుంచి సాసారామ్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. రైలు నంబరు 07041(చర్లపల్లి – సాసారామ్) అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి. రైలు నంబరు 07042 (సాసారామ్ – చర్లపల్లి) అక్టోబర్ 09, 2026 నుండి నవంబర్ 27, 2026 వరకు ప్రతి శుక్రవారం మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
స్టాపేజీలు
{{/usCountry}}ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భబువా రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైళ్లలో ఏసీ 1st క్లాస్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అమర్చారు. ప్రయాణికులు ఈ పండుగ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా, ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.