దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి టూ దానాపూర్, బెంగళూరు
SCR Special Trains : దసరా, దీపావళి, సంక్రాంతిలాంటి ముఖ్యమైన పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అంతేకాదు హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌లను కూడా ఇచ్చింది.
దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, రద్దీని నివారించడం, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల పొడిగింపుతో పాటు, కొత్త ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు, హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలిక హాల్ట్‌లను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్-దానాపూర్
హైదరాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 9 ట్రిప్పుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రైలు నం. 07091 (హైదరాబాద్ – దానాపూర్) రైలు అక్టోబర్ 3, 2026 నుండి నవంబర్ 28, 2026 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి సోమవారం అర్ధరాత్రి 12:30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది
రైలు నం. 07092 (దానాపూర్ – హైదరాబాద్) రైలు అక్టోబర్ 5, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు దానాపూర్ నుండి బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.
చర్లపల్లి-దానాపూర్
పండుగ కాలంలో అదనపు రద్దీని తట్టుకోవడానికి చర్లపల్లి నుండి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. రైలు నం. 07049 (చార్లపల్లి – దానాపూర్) అక్టోబర్ 4, 2026 నుండి నవంబర్ 29, 2026 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
రైలు నం. 07050 (దానాపూర్ – చర్లపల్లి) అక్టోబర్ 5, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.
స్టాపేజీలు చూసుకుంటే.. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్ని, మైహార్, సత్నా, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా. చర్లపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
చర్లపల్లి-బెంగళూరు
07065 (చర్లపల్లి - ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు) అక్టోబర్ 5, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.
రైలు నం. 07066 (ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు – చర్లపల్లి) అక్టోబర్ 6, 2026 నుండి డిసెంబర్ 1, 2026 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.
సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంకలో ట్రైన్ ఆగుతుంది.
హైటెక్ సిటీలో హాల్టింగ్
హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు నవంబర్ 1, 2026 నుండి జనవరి 31, 2027 వరకు (3 నెలల పాటు) 10 ప్రధాన రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగే వెసులుబాటు కల్పించారు.
22718 సికింద్రాబాద్ – రాజ్‌కోట్, 22717 రాజ్‌కోట్ – సికింద్రాబాద్, 20967సికింద్రాబాద్ – పోర్‌బందర్, 20968 పోర్‌బందర్ – సికింద్రాబాద్, 12731 తిరుపతి – సికింద్రాబాద్, 12732 సికింద్రాబాద్ – తిరుపతి, 12702 హైదరాబాద్ – సిఎస్‌టీ ముంబై, 12701 సిఎస్‌టీ ముంబై – హైదరాబాద్, 12025 పుణే – హైదరాబాద్, 12026 హైదరాబాద్ – పుణే ట్రైన్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్ ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


