విశాఖ - బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు… దసరా, దీపావళి వేళ రాకపోకలు! తేదీలివే

Visakhapatnam Bengaluru Special Trains : దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-బెంగళూరు మధ్య  ప్రత్యేక రైళ్లను నడపనున్నాయు. ఈ మేరకు  దక్షిణ రైల్వే వివరాలను వెల్లడించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Published on: Sep 27, 2026, 12:29:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Visakhapatnam Bengaluru Special Trains : రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ రైల్వే (Southern Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా చెరో 8 సర్వీసుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అక్టోబర్, నవంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

రైళ్ల వివరాలు - టైమింగ్స్ :

  • రైలు నంబరు 08583 (విశాఖపట్నం - SMVT బెంగళూరు) : ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20, 27 మరియు నవంబర్ 3, 10, 17, 24 తేదీలలో (మంగళవారాలు) విశాఖపట్నంలో సాయంత్రం 19:00 గంటలకు (రాత్రి 7.00) బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 12:45 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది.
  • రైలు నంబరు 08584 (SMVT బెంగళూరు - విశాఖపట్నం) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 7, 14, 21, 28 మరియు నవంబర్ 4, 11, 18, 25 తేదీలలో (బుధవారాలు) SMVT బెంగళూరులో మధ్యాహ్నం 15:50 గంటలకు (3.50) బయలుదేరుతుంది. మరుసటి రోజు (గురువారం) మధ్యాహ్నం 13:30 గంటలకు (1.30) విశాఖపట్నం చేరుకుంటుంది.

హాల్టింగ్ లిస్ట్….

ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More