సికింద్రాబాద్ - లాలాగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం..!

సికింద్రాబాద్- లాలాగూడ మధ్య విద్యుత్ తీగల (OHE) లోపం వల్ల రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.

Published on: Sep 14, 2026, 11:17:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సికింద్రాబాద్ - లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్య ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ ఈక్విప్‌మెంట్ (OHE) సాంకేతిక సమస్యతో హఠాత్తుగా నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు విఘాతం కలిగింది. ఆదివారం రాత్రి 10:38 గంటల సమయంలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (ఫైల్ ఫొటో)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (ఫైల్ ఫొటో)

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది హుటాహుటిన రెస్క్యూ పనుల్లోకి దిగి, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పర్యవేక్షణ చేపట్టారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రధాన మార్గంలో రైళ్ల సేవలు సజావుగా పునరుద్ధరించారు. ప్రస్తుతం అప్ , డౌన్ లైన్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత…

ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లు దాదాపు 10 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా రైలు సంఖ్య 12795 విజయవాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు లాలాగూడ విభాగంలో కొంతసేపు నిలిచిపోగా…. ఆ తర్వాత అధికారులు దాన్ని సికింద్రాబాద్ వైపు సురక్షితంగా పంపించారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ, ఎలాంటి ప్రాణనష్టం కానీ జరగకపోవడంతో రైల్వే యంత్రాంగం మరియు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా… శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా శిఖోహాబాద్ రైల్వే స్టేషన్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఒక ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే బోగీ నలువైపులా పొగలు, మంటలు దట్టంగా అలుముకున్నాయి.

విషయం గమనించిన స్థానిక మహిళ మాయాదేవి వర్మ వెంటనే సమాచారాన్ని మిగతా వారికి తెలపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. "నేను బోగీ నుంచి పొగలు రావడం చూసి వెంటనే బయటకు వచ్చి అందరినీ అప్రమత్తం చేశాను," అని ఆమె తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనున్న ఇతర బోగీలకు వ్యాపించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభావితమైన బోగీని ఇతర కోచ్‌ల నుంచి వేరు చేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More