Festival Special Trains : పండుగ వేళ ప్రయాణికులకు మరో అప్డేట్... సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Festival Special Trains : పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్-హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

Published on: Sep 13, 2026, 06:02:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Festival Special Trains : వినాయక చవిత వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్ డెక్కన్ మార్గంలో ప్రత్యేక పండుగ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

ప్రత్యేక రైళ్ల వివరాలు - టైమింగ్స్:

  • రైలు నంబర్ 07035 (సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్): ఈ రైలు 14.09.2026న మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07036 (సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ డెక్కన్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 14.09.2026న సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్‌లో బయలుదేరి, రాత్రి 23:15 (11:15) గంటలకు హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి) చేరుకుంటుంది.

హాల్టింగ్ లిస్ట్…

  • సికింద్రాబాద్ : 07035 (బయలుదేరు సమయం: 12:10), 07036 (రాక: 22:45 / బయలుదేరే సమయం: 22:50)
  • చర్లపల్లి : 07035 (12:30 / 12:32) | 07036 (22:23 / 22:25)
  • భోంగీర్(భువనగిరి) : 07035 (12:59 / 13:00) | 07036 (21:54 / 21:55)
  • జనగాం : 07035 (13:29 / 13:30) | 07036 (21:19 / 21:20)
  • కాజీపేట: 07035 (14:23 / 14:25) | 07036 (20:33 / 20:35)
  • జమ్మకుంట : 07035 (15:00 / 15:01) | 07036 (20:00 / 20:01)
  • పెద్దపల్లి : 07035 (15:30 / 15:31) | 07036 (19:30 / 19:31)
  • రామగుండం : 07035 (15:49 / 15:50) | 07036 (19:10 / 19:11)
  • మంచిర్యాల : 07035 (16:11 / 16:12) | 07036 (18:56 / 18:57)
  • బెల్లంపల్లి : 07035 (16:30 / 16:31) | 07036 (18:35 / 18:36)
  • ఆసిఫాబాద్ రోడ్ : 07035 (16:45 / 16:46) | 07036 (18:14 / 18:15)
  • సిర్పూర్ కాగజ్ నగర్ : 07035 (రాక: 17:30) | 07036 (బయలుదేరే సమయం: 18:00)

కోచ్ వివరాలు:

ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వుడ్ ఏసీ ఛైర్ కార్, అన్‌రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పండుగ పూట ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More