దక్షిణ మధ్య రైల్వే ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య కూడా
దక్షిణ మధ్య రైల్వే తాజాగా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం దొరకనుంది. అంతేకాదు పలు రైళ్లను కూడా రైల్వే శాఖ పొడిగించింది.
అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య కింది విధంగా ప్రత్యేక రైళ్లను నడపనుంది.

సికింద్రాబాద్ – కాకినాడ టౌన్
ట్రైన్ 07039 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య 07.10.26 నుండి 25.11.26 వరకు 8 సర్వీసులు నడవనున్నాయి.
రైలు నెంబర్ 07040 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ నడుమ 08.10.26 నుండి 26.11.26 వరకు 8 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
జల్నా – యలహంక
మరికొన్ని ప్రత్యేక రైళ్లు పలు తేదీలలో నడిచేలా పొడిగించారు.
ట్రైన్ నెంబర్ 07601 జల్నా – యలహంక 04.10.26 నుండి 25.10.26 వరకు 4 సర్వీసులు నడుస్తాయి.
రైలు నెంబర్ 07602 యలహంక – జల్నా 05.10.26 నుండి 26.10.26 వరకు 4 సర్వీసులు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు పర్చూరు, సెల్లు, పర్భాని, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోల్లారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం, ధర్మాపూర్ రోడ్డు, అనకొండల్, ధర్మాపూర్ రోడ్, అదోని, హిందూపూర్ స్టేషన్లలలో ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
చర్లపల్లి - బెర్హంపూర్
07027 చర్లపల్లి - బెర్హంపూర్ 02.10.26 నుండి 27.11.26 వరకు 9 సర్వీసులు నడుస్తుంది.
07028 బెర్హంపూర్ - చర్లపల్లి 03.10.26 నుండి 28.11.26 వరకు 9 సర్వీసులు నడవనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట్, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
సీఎస్టీ ముంబై - చెన్నై బీచ్
01015 సీఎస్టీ ముంబై - చెన్నై బీచ్ 14.10.26 నుండి 18.11.26 వరకు 6 సర్వీసులు నడవనున్నాయి.
01016 చెన్నై బీచ్ - సీఎస్టీ ముంబై 15.10.26 నుండి 19.11.26 వరకు 6 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురగి, వాడి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అరక్కోణం, పేరంబూర్ స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ కోచ్‌లు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


