MMTS Special Trains : ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం - ప్రత్యేకంగా 22 MMTS రైళ్లు, టైమింగ్స్ వివరాలు ఇలా
Khairatabad Bada Ganesh MMTS Trains : ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 22 MMTS రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ రైళ్లు నిలవనున్నాయి.
Khairatabad Bada Ganesh MMTS Trains : హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, భక్తులు ఎలాంటి రద్దీ ఇబ్బందులు లేకుండా సులభంగా ఖైరతాబాద్ చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 22 ప్రత్యేక రైళ్లు….
మొత్తం 22 ఎంఎంటీఎస్ (MMTS) లోకల్ రైళ్లు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిచేలా ప్రత్యేక స్టాపేజ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ప్రయాణించే నిత్య ప్రయాణికులతో పాటు గణనాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో సర్వీసులు
సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్), లింగంపల్లి, మేడ్చల్, ఫలక్‌నుమా మరియు రామచంద్రాపురం మార్గాల నుంచి నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు ఖైరతాబాద్ స్టేషన్‌లో ఆగనున్నాయి. ఉదయం 05:15 గంటల నుంచి రాత్రి 22:21 గంటల వరకు వివిధ సమయాల్లో ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రైళ్ల రాకపోకల సమయ పట్టిక (ఖైరతాబాద్ స్టేషన్‌లో):
- సికింద్రాబాద్ - హైదరాబాద్ (47206): రాక 05:15 , బయలుదేరు సమయం 05:16
- హైదరాబాద్ - లింగంపల్లి (47101): రాక 05:56 , బయలుదేరు సమయం 05:57
- హైదరాబాద్ - లింగంపల్లి (47102): రాక 06:46 | బయలుదేరు సమయం 06:47
- లింగంపల్లి - హైదరాబాద్ (47126): రాక 07:38 , బయలుదేరు సమయం 07:39
- హైదరాబాద్ - లింగంపల్లి (47103): రాక 08:16 ,m బయలుదేరు సమయం 08:17
- లింగంపల్లి - హైదరాబాద్ (47128): రాక 08:33 , బయలుదేరు సమయం 08:34
- హైదరాబాద్ - లింగంపల్లి (47104): రాక 09:06 , బయలుదేరు సమయం 09:07
- మేడ్చల్ - హైదరాబాద్ (47233): రాక 09:57 , బయలుదేరు సమయం 09:58
- లింగంపల్లి - హైదరాబాద్ (47130): రాక 10:23 , బయలుదేరు సమయం 10:24
- హైదరాబాద్ - లింగంపల్లి (47111): రాక 10:56, బయలుదేరు సమయం 10:57
- హైదరాబాద్ - మేడ్చల్ (47234): రాక 11:07 , బయలుదేరు సమయం 11:08
- లింగంపల్లి - హైదరాబాద్ (47140): రాక 16:38 , బయలుదేరు సమయం 16:39
- ఫలక్‌నుమా - హైదరాబాద్ (47201) : రాక 17:07, బయలుదేరు సమయం 17:08
- హైదరాబాద్ - లింగంపల్లి (47120): రాక 17:26 | బయలుదేరు సమయం 17:27
- రామచంద్రాపురం TS - హైదరాబాద్ (47142): రాక 17:48 | బయలుదేరు సమయం 17:49
- హైదరాబాద్ - లింగంపల్లి (47119): రాక 18:11 , బయలుదేరు సమయం 18:12
- హైదరాబాద్ - లింగంపల్లి (47121): రాక 19:06 , బయలుదేరు సమయం 19:07
- లింగంపల్లి - హైదరాబాద్ (47143): రాక 19:28, బయలుదేరు సమయం 19:29
- హైదరాబాద్ - లింగంపల్లి (47122): రాక 20:06 , బయలుదేరు సమయం 20:07
- లింగంపల్లి - హైదరాబాద్ (47145): రాక 20:48 , బయలుదేరు సమయం 20:49
- లింగంపల్లి - హైదరాబాద్ (47146): రాక 21:43 , బయలుదేరు సమయం 21:44
- హైదరాబాద్ - లింగంపల్లి (47125): రాక 22:21 , బయలుదేరు సమయం 22:22
రోడ్లపై వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని భక్తులు సురక్షితంగా, వేగంగా ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకోవడానికి ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

