గణేష్ చతుర్థి స్పెషల్ రైళ్లు.. హైదరాబాద్-వత్వా మధ్య నడవనున్న ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు

వినాయక చవితి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ-గుజరాత్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం దొరకనుంది.

Published on: Sep 16, 2026, 14:44:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్-వత్వా (అహ్మదాబాద్ సమీపంలో) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

గణేష్ చతుర్థి స్పెషల్ రైళ్లు
గణేష్ చతుర్థి స్పెషల్ రైళ్లు

పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్పెషల్ రైళ్లు ఎంతో ఊరట కలిగించనున్నాయి.

ట్రైన్ నెంబర్ 07087 హైదరాబాద్ – వత్వా మధ్య సెప్టెంబర్ 19వ తేదీన శనివారం రాత్రి 08:15 గంటలకుహైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి 9:50 గంటలకు వత్వా చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 07088 వత్వా – హైదరాబాద్ సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం తెల్లవారుజామున 03:30 గంటలకు బయలుదేరి... మంగళవారం తెల్లవారుజామున 04:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణించే సమయంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కలబురగి, సోలాపూర్, దౌండ్, పుణే, కళ్యాణ్, వసాయ్ రోడ్, వల్సాడ్, సూరత్, వడోదర స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండేలా ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. గణేషుడి నవరాత్రుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందస్తుగా రైల్వే కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.

రైలు కార్యకలాపాల భద్రతపై సమీక్ష

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రధాన అధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ట్రాక్ వెంబడి భద్రతను పటిష్టం చేయాలని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులకు సూచించారు. పెట్రోల్‌మెన్ / ట్రాక్‌మెన్‌లకు, స్టేషన్ సిబ్బందికి మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ఆయన చర్చించారు. అంతేకాకుండా సిబ్బంది, యంత్రాలతో కూడిన విభాగంలో ట్రాక్ నిర్వహణ పనులు చేసేటప్పుడు అధికారులు, సూపర్‌వైజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అమలులో ఉన్న నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

క్షేత్రస్థాయి సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండేలా, విధులు నిర్వర్తించేటప్పుడు భద్రతా నియమాలలో ఉన్న నియమావళి / విధానం ప్రకారం నడుచుకునేలా సూపర్‌వైజర్లు వారికి సలహా ఇవ్వాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. తాజా భద్రతా నియమావళి, నియమాలు, కార్యాచరణ పద్ధతులపై అప్డేట్ కావాలన్నారు.

చెట్ల కొమ్మల కత్తిరింపు స్థితిని జనరల్ మేనేజర్ సమీక్షించారు. సిబ్బందికి సంకేతాలు స్పష్టంగా కనిపించేలా ప్రక్రియను, వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఏ పని చేస్తున్నా, పని చేసే ప్రదేశం రక్షణపై నిరంతరం దృష్టి పెట్టడం, వివిధ విభాగాల మధ్య సజావైన సమన్వయం ప్రాముఖ్యతను జనరల్ మేనేజర్ పునరుద్ఘాటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More