డిసెంబర్ వరకు చర్లపల్లి నుంచి ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్.. వయా ఆంధ్రప్రదేశ్!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి కీలక ప్రాంతాలకు రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్స్ ఏపీ మీదుగా వెళ్తాయి.
రద్దీ సమయాల్లో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి తదితర పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి చర్లపల్లి - సెంగోట్టై, అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ - చర్లపల్లి మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన చర్లపల్లి టెర్మినస్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతాయి.
చర్లపల్లి – సెంగోట్టై – చర్లపల్లి
చర్లపల్లి – సెంగోట్టై – చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్ మొత్తం 18 సర్వీసులు నడుస్తాయి. తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి - సెంగోట్టై మధ్య వారానికి ఒకరోజు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
రైలు నంబరు 07191 (చర్లపల్లి – సెంగోట్టై) రైలు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 2, 2026 నుంచి నవంబర్ 27, 2026 వరకు మొత్తం 09 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రైలు నంబరు 07192 (సెంగోట్టై – చర్లపల్లి) తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శనివారం సెంగోట్టై నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 3, 2026 నుంచి నవంబర్ 28, 2026 వరకు మొత్తం 09 సర్వీసులు నడుస్తాయి.
ఈ రైళ్లు ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పొల్లాచి, ఉడుమలైపేటై, పళని, ఒడ్డన్‌ఛత్రం, దిండిగల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూర్, రాజపాళయం, శంకరన్‌కోవిల్, కడైయనల్లూర్, తెన్కాసి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ప్రయాగ్‌రాజ్ – చర్లపల్లి – ప్రయాగ్‌రాజ్
ప్రయాగ్‌రాజ్ – చర్లపల్లి – ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్స్ మొత్తం 20 సర్వీసులు ఉంటాయి. ఉత్తర భారతదేశానికి ప్రయాణించే వారి కోసం ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), చర్లపల్లి మధ్య ఈ రైళ్లు నడుస్తాయి.
రైలు నంబరు 04121 (ప్రయాగ్‌రాజ్ – చర్లపల్లి) ప్రతి సోమవారం ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 28, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు మొత్తం 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రైలు నంబరు 04122 (చర్లపల్లి – ప్రయాగ్‌రాజ్) ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 29, 2026 నుంచి డిసెంబర్ 01, 2026 వరకు మొత్తం 10 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా మాణిక్‌పూర్, సత్నా, జబల్‌పూర్, ఇటార్సీ, బేతుల్, పంధుర్నా, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
పండుగల వేళ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ప్రయాణికులు రైల్వే ఎంక్వైరీ నంబర్ 139 లేదా www.enquiry.indianrail.gov.in పోర్టల్‌ను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


