Weekly Special Trains : అక్టోబర్, నవంబర్‌లో చర్లపల్లి నుంచి వీక్లీ స్పెషల్ ట్రైన్స్
SCR Weekly Special Trains : అక్టోబర్, నవంబర్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ట్రైన్స్ చర్లపల్లి నుంచి నడుస్తాయి
దసరా, దీపావళి వంటి రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. వివిధ రాష్ట్రాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి సాసారామ్ మార్గాల్లో వీక్లీ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ - చర్లపల్లి
ఈ ప్రత్యేక రైలు వారానికి ఒకరోజు చొప్పున మొత్తం 7 సర్వీసులు నడవనుంది. రైలు నంబరు 07021 (చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్) అక్టోబర్ 19, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. రైలు నంబరు 07022 (హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి) అక్టోబర్ 21, 2026 నుండి డిసెంబర్ 02, 2026 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.
చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరికొన్ని వీక్లీ ప్రత్యేక రైళ్లను 6 సర్వీసుల పాటు నడుపుతున్నారు. రైలు నంబరు 07023 (చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్) అక్టోబర్ 20, 2026 నుండి నవంబర్ 24, 2026 వరకు ప్రతి మంగళవారం రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నంబరు 07024 (హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి) అక్టోబర్ 22, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
స్టాపేజీలు
ఈ రైళ్లు ఇరువైపులా కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్‌పూర్, ఆగ్రా కాంట్, మధుర, కోసి కలాన్ స్టేషన్లలో నిలుస్తాయి. ఈ రైళ్లలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
చర్లపల్లి - సాసారామ్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు
పండుగ వేళ బీహార్, ఉత్తరప్రదేశ్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల కోసం చర్లపల్లి నుంచి సాసారామ్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. రైలు నంబరు 07041(చర్లపల్లి – సాసారామ్) అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 26, 2026 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి. రైలు నంబరు 07042 (సాసారామ్ – చర్లపల్లి) అక్టోబర్ 09, 2026 నుండి నవంబర్ 27, 2026 వరకు ప్రతి శుక్రవారం మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
స్టాపేజీలు
ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భబువా రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైళ్లలో ఏసీ 1st క్లాస్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అమర్చారు. ప్రయాణికులు ఈ పండుగ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా, ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


